Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mental Health : ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టింది గుండెజబ్బులు. తర్వాత క్యాన్సర్ మానవాళికి అతిపెద్ద శాపంగా మారింది. కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా, కనిపించని యుద్ధంలా మనుషుల మనసుల్ని తినేస్తున్న మరో మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అదే మానసిక రుగ్మతలు. శరీరాన్ని కాదు… ఆలోచనల్ని దెబ్బతీసే ఈ సంక్షోభం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారిపోయిందని తాజాగా వెలుగులోకి వచ్చిన భారీ అధ్యయనం చెబుతోంది. ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం, భయం… ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎదుట కూడా అతిపెద్ద సవాలుగా మారుతున్నాయి.
ప్రముఖ హెల్త్ జర్నల్ ‘ది లాన్సెట్’ తాజాగా ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 కోట్ల మంది ఏదో ఒక మానసిక సమస్యతో (Mental Health Issues) బాధపడుతున్నారు. విచిత్రం ఏంటంటే, 1990తో పోలిస్తే ఈ రోగుల సంఖ్య ఇప్పుడు డబుల్ అయిపోయింది. ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ 2023’ స్టడీలో భాగంగా.. క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఏకంగా 204 దేశాల్లో 1990 నుండి 2023 వరకు జరిగిన పరిస్థితులపై రీసెర్చ్ చేసి ఈ వివరాలు చెప్పారు.
Also Read
- Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
- Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
ఈ రిపోర్ట్‌లో అందరినీ భయపెడుతున్న విషయం ఏంటంటే.. ప్రపంచంలో మనుషులు వైకల్యం (డిసబిలిటీ) బారిన పడటానికి ఇప్పుడు మెయిన్ కారణం ఈ మానసిక జబ్బులేనట. టెన్షన్లు, డిప్రెషన్ల వల్ల మనుషులు తమ జీవితంలో ఎంతో సంతోషకరమైన కాలాన్ని, జీవిత కాలాన్ని కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైకల్యంతో గడిచే మొత్తం జీవితంలో 17 శాతం కంటే ఎక్కువ వాటా ఈ మానసిక సమస్యలదేనని తేలింది. 1990లో ప్రపంచాన్ని వేధించే రోగాల్లో 12వ స్థానంలో ఉన్న మానసిక జబ్బులు.. ఇప్పుడు ఏకంగా 5వ స్థానానికి చేరిపోయాయి. దీన్ని బట్టి పరిస్థితి ఎంత వేగంగా దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యేకంగా కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితి మరింత విషమించింది. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ కేసులు 24 శాతం పెరిగితే, ఆందోళన సంబంధిత రుగ్మతలు 47 శాతానికి పైగా పెరిగాయి. క్వీన్స్‌ల్యాండ్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ డామియన్ సాంటోమౌరో మాట్లాడుతూ కరోనా తర్వాత వచ్చిన ఒత్తిడి, ఆర్థిక అస్థిరత, పేదరికం, సామాజిక బంధాలు తగ్గిపోవడం వంటి అంశాలు ఈ పరిస్థితిని మరింత పెంచాయని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్య వ్యవస్థల్లో భారీ పెట్టుబడులు, అందరికీ చికిత్స అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ప్రపంచస్థాయి సమన్వయం లేకపోతే ఈ సంక్షోభాన్ని నియంత్రించడం అసాధ్యమవుతుందని హెచ్చరించారు.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే యువత, ముఖ్యంగా టీనేజర్లు ఈ సంక్షోభానికి ఎక్కువగా గురవుతున్నారు. 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మానసిక సమస్యల భారం అత్యధికంగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఇదే వయసులో విద్య, ఉద్యోగ భవిష్యత్తు, సంబంధాలు, సామాజిక ఒత్తిళ్లు ఎక్కువగా ప్రభావం చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. మరోవైపు మహిళల్లో మానసిక సమస్యల తీవ్రత పురుషుల కంటే ఎక్కువగా ఉంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 62 కోట్ల మహిళలు మానసిక రుగ్మతలతో జీవిస్తుండగా, పురుషుల సంఖ్య 55 కోట్లుగా నమోదైంది. గృహహింస, లైంగిక వేధింపులు, కుటుంబ బాధ్యతలు, లింగ అసమానత వంటి అంశాలు మహిళలపై ఎక్కువ మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని అధ్యయనం చెబుతోంది.
అయితే ఇంత పెద్ద సంక్షోభం ఎదురుగా ఉన్నప్పటికీ చికిత్స మాత్రం ప్రపంచంలో చాలా మందికి అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా మేజర్ డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో కేవలం 9 శాతం మందికే కనీస స్థాయి సరైన చికిత్స అందుతోంది. దాదాపు 90 దేశాల్లో ఐదు శాతం మందికంటే తక్కువ మంది మాత్రమే సరైన మానసిక ఆరోగ్య సేవలు పొందుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్ వంటి కొద్ది అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే చికిత్స 30 శాతానికి పైగా అందుబాటులో ఉంది. మనసు బలహీనమైతే శరీరం కూడా నిలబడలేదని ఈ నివేదిక మరోసారి ప్రపంచానికి గుర్తుచేస్తోంది. మానసిక ఆరోగ్యం వ్యక్తిగత సమస్య కాదు… అది ఇప్పుడు గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మారుతోంది. ప్రభుత్వాలు, ఆరోగ్య వ్యవస్థలు తప్పనిసరిగా వీటి గురించి బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!