NTV Telugu Site icon

Lung cancer: భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్.. కారణం ఇదే…

Lung Cancer

Lung Cancer

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలోని యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వేగంగా విస్తరిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో ఎక్కువ మంది ఎప్పుడూ పొగతాగని వారే ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఆగ్నేయాసియాలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై ఓ అధ్యయనాన్నిసైన్స్ జర్నల్ ‘లాన్సెట్’లో ప్రచురించారు. ఇప్పుడు పొగతాగని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తోందని దాంట్లో తెలిపారు.

READ MORE: BMW Hit-And-Run: యాక్సిడెంట్‌కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిని నిందితుడు మిహిర్‌షా..

లాన్సెట్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. 2020లో ప్రపంచవ్యాప్తంగా 22 లక్షలకు పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 18 లక్షల మంది మరణించారు. భారత్ లో 2020లో 72,510 మంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ సంవత్సరం 66,279 మంది రోగులు మరణించారు. 2020లో భారతదేశంలో సంభవించిన క్యాన్సర్ మరణాలలో 7.8% ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించాయి.

READ MORE: Venky Anil3: యానిమల్ నటుడిని దింపుతున్న రావిపూడి

భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణలో సగటు వయస్సు పాశ్చాత్య దేశాలలో కంటే 10 సంవత్సరాలు తక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సగటు వయస్సు 28.2 సంవత్సరాలగా వెల్లడించింది. అయితే.. దీనికి ఒక కారణం భారతదేశంలోని యువ జనాభా కూడా కావచ్చు. పాశ్చాత్య దేశాలలో, ఊపిరితిత్తుల క్యాన్సర్ 54 నుంచి 70 సంవత్సరాల మధ్య నిర్ధారణ చేయబడుతుంది. అయితే.. అమెరికాలో ఈ క్యాన్సర్ బారిన పడ్డ రోగుల సగటు వయస్సు 38 సంవత్సరాలు కాగా.. చైనాలో 39 సంవత్సరాలగా అధ్యయనం పేర్కొంది. 1990లో.. భారతదేశంలో ప్రతి లక్ష జనాభాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ రేటు 6.62 ఉండగా.. అది 2019లో 7.7కి పెరిగింది. 1990 నుంచి 2019 మధ్యకాలంలో.. ఇది పురుషులలో 10.36 నుంచి 11.16కి .. స్త్రీలలో 2.68 నుంచి 4.49కి పెరిగింది.