NTV Telugu Site icon

Deep Sleep: గాఢ నిద్ర లేకపోతే పక్షవాతం, అల్జీమర్స్ ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి.

Deep Sleep

Deep Sleep

Deep Sleep: నిద్ర అనేది మానవ శరీరానికి చాలా అవసరం. మన దినచర్యలో భాగం. నిద్ర మన శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. శరీరం నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు చురుకుగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. ఇదిలా ఉంటే గాఢ నిద్ర తగ్గే కొద్ది పక్షవాతం, అల్జీమర్స్ వ్యాధితో పాటు మతిమరుపు సమస్యలు పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ యొక్క మెడికల్ జర్నల్ అయిన న్యూరాలజీలో ఈ కొత్త పరిశోధన ప్రచురించబడింది.

‘‘స్లీప్ అప్నియా’’ మెదడులో మార్పులకు కారణం అవుతుందని అధ్యయనం నిరూపించింది. స్లీప్ అప్నియా అనేది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. దీంట్లో శ్వాస పదేపదే ఆగిపోయి ప్రారంభమవుతుంది. మీరు గరక పెట్టడం, పూర్తిగా రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే మీకు స్లీప్ అప్నియా వచ్చే అవకాశం ఉంది. మెదడులోని తెల్లగా ఉండే పదార్థంలో బ్రెయిన్ బయోమార్కర్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని తెలియపరుస్తాయి. ఈ బయోమార్కర్లు సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి సంబంధించిన సంకేతాలను ఇస్తాయి. మెదడులో ఈ మార్పులకు ప్రస్తుతం చికిత్స లేదని అందువల్ల, ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి మార్గాలు కనుగొనాలని పరిశోధకులు తెలిపారు.

Read Also: Congress: మరో విపత్తుకు నాంది.. రూ. 2000 నోట్ల రద్దుపై ప్రధాని లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు..

ఈ అధ్యయనంలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్న 140 మంది పాల్గొన్నారు, పాల్గొనేవారి సగటు వయస్సు 73 సంవత్సరాలు. అధ్యయనం ప్రారంభంలో పాల్గొన్న వారికి ఈ అధ్యయనంలో పాల్గొనే ముందు వారికి మతిమరుపు, ఏకాగ్రత, కొత్త విషయాలను నేర్చుకోలేకపోవడం వంటి సమస్యలు లేవు. వీరలో 34 శాతం మంది తేలికపాటి, 32 శాతం మంది మధ్యస్థ, 34 శాతం మంది తీవ్రమైన స్లీప్ అప్నియా ఉంది. వీరంతా ఎంత సేపు గాఢ నిద్రలో ఉన్నారనే విషయాలను అధ్యయనం పరిశీలించింది. తేలికపాటి, మధ్యస్థ స్లీప్ అప్నియాతో ఉన్నవారి కన్నా తీవ్రమైన స్లీప్ అప్నియాతో ఉన్నవారిలో మెదడులోని వైట్ మ్యాటర్ లో హైపర్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారి మెదడుల్లో నాడీ కణాలను అనుసంధానించే అక్సోనల్ ఇంటిగ్రిటీ కూడా తగ్గినట్లు తేలింది. వైట్ మ్యాటర్ హైపర్‌సెన్సివిటీస్ అనేది మెదడు స్కాన్‌లలో కనిపించే చిన్న గాయాలు.