NTV Telugu Site icon

First Mpox Case In India: భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు..

Monkey

Monkey

First Mpox Case In India: మంకీపాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో అలజడి రేపిన ఈ వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా తెలిపింది. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించింది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. పాజిటివ్‌గా నిర్ధారించినట్లు పేర్కొనింది. టెస్టుల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 మంకీపాక్స్ వైరస్ ఉనికిని గుర్తించినట్లు వైద్యులు చెప్పారు. కాగా, ఇప్పటి వరకు భారత్ లో ఒకటే కేసు నమోదైందని.. జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసు గత 30 కేసుల మాదిరిగానే ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యా శాఖ చెప్పుకొచ్చింది.

Read Also: SL vs ENG: పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ గడ్డపై శ్రీలంక విజయం..

అయితే, మంకీపాక్స్ సోకిన వ్యక్తి.. వైరస్ వ్యాప్తి చెందుతున్న దేశం నుంచి ప్రయాణించిన ఒక యువకుడని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచినట్లు తెలిపారు. రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని వెల్లడించారు. అలాగే, మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో భారత్‌ కూడా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఎయిర్‌పోర్టులు, రేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు వీలుగా దేశంలో 32 ప్రత్యేక లాబ్స్‌, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.