First Mpox Case In India: భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు..
- భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు..
- పశ్చిమ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ..
- ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కేంద్ర వైద్యారోగ్యా శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Mpox Case In India: మంకీపాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో అలజడి రేపిన ఈ వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా తెలిపింది. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించింది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. పాజిటివ్‌గా నిర్ధారించినట్లు పేర్కొనింది. టెస్టుల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 మంకీపాక్స్ వైరస్ ఉనికిని గుర్తించినట్లు వైద్యులు చెప్పారు. కాగా, ఇప్పటి వరకు భారత్ లో ఒకటే కేసు నమోదైందని.. జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసు గత 30 కేసుల మాదిరిగానే ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యా శాఖ చెప్పుకొచ్చింది.
Read Also: SL vs ENG: పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక విజయం..
Also Read
- Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
- Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
అయితే, మంకీపాక్స్ సోకిన వ్యక్తి.. వైరస్ వ్యాప్తి చెందుతున్న దేశం నుంచి ప్రయాణించిన ఒక యువకుడని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచినట్లు తెలిపారు. రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని వెల్లడించారు. అలాగే, మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో భారత్ కూడా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఎయిర్‌పోర్టులు, రేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించేందుకు వీలుగా దేశంలో 32 ప్రత్యేక లాబ్స్, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
A young male patient, who recently travelled from a country currently experiencing Mpox (monkeypox) transmission, has been identified as a suspect case of Mpox. The patient has been isolated in a designated hospital and is currently stable. Samples from the patient are being… pic.twitter.com/2DUNueIZWr
— ANI (@ANI) September 8, 2024
తాజావార్తలు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్‌మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!