NTV Telugu Site icon

Vitamin D: విటమిన్-డితో తగ్గనున్న టైప్-2 డయాబెటిస్ ముప్పు..

Vitamin D

Vitamin D

Increase in vitamin D supplements could reduce risk of type 2 diabetes: ఇండియాలో డయాబెటిక్ వ్యాధి ఏటేటా పెరుగుతోంది. జీవనశైలిలో మార్పు రావడం, శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు ఇలా షుగర్ వ్యాధికి అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే విటమిన్-డి, టైప్ -2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. టప్ట్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు విటమిన్-డి తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

Read Also: Phone Addict: ఫోన్ చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్న హైదరాబాదీ మహిళ

ముఖ్యంగా షుగర్ వచ్చే పరిస్థితుల్లో ప్రీడయాబెటిక్ స్టేజ్ లో ఉన్న పెద్దల్లో విటమిన్ -డి తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది రక్తంలో షుగర్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. టైప్ 2 డయాబెటిస్ గా నిర్థారించలేని స్థితి. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ ప్రకారం.. సూర్యరశ్మి ద్వారా విటమిన్ -డి అనేది శరీరానికి అందుతుంది. కొవ్వులో కరిగే విటమిన్ అయిన విటమిన్ -డి, ఇన్సులిన్, గ్లూకోజ్ జీవక్రియలను సంబంధాన్ని కలిగి ఉంది.

రక్తంలో విటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ప్రీడయాబెటిక్ స్టేజ్ లో ఉన్న పెద్దల్లో విటమిన్ – డి, టైప్-2 డయాబెటిక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. మూడు సంవత్సరాల కాలంలో చేసిన ఓ రీసెర్చ్ ప్రకారం విటమిన్ డి తీసుకున్న ఓవరాల్ గా 15 శాతం డయాబెటిస్ రిస్క్ తగ్గినట్లు తేలింది. అయితే అధిక మోతాదులో విటమిన్-డిని తీసుకోవడం కూడా చెడు ఫలితాలను ఇస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యులను సంప్రదించిన తర్వాతే విటమిన్ -డి వాడటం ప్రారంభిస్తే టైప్-2 డయాబెటిస్ ను తగ్గించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.