అన్ని వయసుల వ్యక్తులు తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన శరీరం ఉంటే ఏమైనా సాధించగలం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఒక నిర్దిష్ట వయసు తర్వాత శరీరం బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. వయసు సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఎవరి జీవితంలోనైనా 60 ఏళ్ల వయస్సు చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో చాలా మంది ఆరోగ్య సమస్యల కారణంగా చాలా ఆందోళన చెందుతారు. అయితే కొందరు మాత్రం ఈ వయసులో ఆరోగ్యంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇందుకోసం జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడికి దూరంగా ఉండటం ముఖ్యం..
పెరుగుతున్న వయసుతో మిమ్మల్ని మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే శారీరక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. దీనికి ఉత్తమ మార్గం ప్రతిరోజూ ప్రకృతిలో లేదా ఎక్కడైనా ప్రశాంత వాతావరణంలో గడపాలి. లేకపోతే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి ధ్యానం చేయాలి. లేదంటే.. మీకు ఇష్టమైన పనులు చేస్తూ కాలం గడపాలి.
తగినంత నిద్ర..
వృద్ధులలో నిద్ర లేకపోవడం తరచుగా కనిపిస్తుంది. దీన్ని నివారించడం చాలా ముఖ్యం. మీరు ప్రతి రాత్రి నిద్రవేళకు అరగంట ముందు గోరువెచ్చని పాలను తీసుకోవచ్చు. అందులో చిటికెడు జాజికాయ లేదా పసుపు కలపడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. ఎముకలను బలపరుస్తుంది. కీళ్ళు, కండరాల నొప్పిని నివారిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల నాణ్యమైన నిద్ర వస్తుంది.
శారీరక శ్రమ చేస్తూ ఉండండి
పెరుగుతున్న వయసుతో కండరాలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా ఏదైనా గాయాలు అయినప్పుడు.. ఆ గాయం ప్రమాదం పెరుగుతుంది. దీని నివారణకు 60 ఏళ్లు పైబడిన వారు రోజూ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. అంతే కాకుండా బాడీ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలంటే ఒంటికాలిపై నిలబడడం, కాళ్లవేళ్లతో కొంత సమయం పాటు నడవడం వంటి పనులు చేయాలి.
ఆహారంపై శ్రద్ధ..
60 ఏళ్ల వయస్సులో ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో చక్కెర, ఉప్పు స్థాయిలను తగ్గించండి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ పండ్లు, డ్రై ఫ్రూట్స్, గింజలు, ధాన్యాలు చేర్చండి. ఫైబర్, ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు..
60 ఏళ్ల వయసులో ఆరోగ్య సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి 6 నెలలకోసారి పూర్తి బాడీ చెకప్ (కొలెస్ట్రాల్ లెవెల్, బ్లడ్ షుగర్, హార్ట్ చెకప్) చేయించుకోవడం మంచిది. ఇది కాకుండా, ఏదైనా అసాధారణ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.