Site icon NTV Telugu

Mosquito Repellent Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే దోమల నివారణ తగ్గించవచ్చు..!

Mosquito

Mosquito

వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో నీరు చేరడం వల్ల దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల మలేరియా, డెంగ్యూ మరియు చికున్‌గున్యా వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల.. మీ ఇంటి చుట్టూ దోమలు చేరకుండా నిరోధించడం ఈ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. పరిశుభ్రతతో పాటు.. కొన్ని మొక్కల సహాయంతో దోమలను దూరంగా ఉంచవచ్చు. ఇంట్లో దోమల నివాణ తగ్గించేందుకు కొన్ని మొక్కలు పెంచుకుంటే.. వాటి వ్యాప్తి తగ్గుతుంది. ఆ మొక్కల సువాసన దోమలకు అస్సలు నచ్చదు. ఈ మస్కిటో రిపెల్లెంట్ ప్లాంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: CS Nirab Kumar Prasad: సీఎస్ పదవీ కాలం పొడిగింపు.. మరో 6 నెలలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

రోజ్మేరీ
రోజ్మేరీని జుట్టు సంరక్షణ కోసం లేదా ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తాము. కానీ ఆ మొక్క వాసన కారణంగా.. దోమలు ఎక్కువగా దరిచేరవు. ఈ మొక్కను ఇంట్లో పెంచడం కూడా చాలా సులభం. మీరు ఈ మొక్కను ఇంట్లో కంటైనర్ లేదా కుండలో సులభంగా పెంచుకోవచ్చు.

లావెండర్
లావెండర్ మొక్క ఎంతో సువాసనను వెదజల్లుతుంది. కానీ.. ఈ వాసన దోమలకు అస్సలు పడదు. దీంతో.. ఆ వాసనకు దోమలు ఉండవు. అందువల్ల.. ఈ మొక్కను మీ ఇంటి చుట్టూ లేదా కిటికీ దగ్గర నాటడం వల్ల మీ ఇంట్లోకి దోమలు రాకుండా ఉంచుతాయి. అంతేకాకుండా.. ఈ మొక్క సువాసన వ్లల బాగా నిద్ర పడుతుంది .

నిమ్మ గడ్డి
దోమలు పుల్లని వాసనలను ఇష్టపడవు. అందుకే లెమన్ గ్రాస్ ఉంటే దోమలు అస్సలు రావు. ఈ మొక్క కొద్దిగా నిమ్మకాయ వాసనతో ఉంటుంది. దీని కారణంగా.. కీటకాలు దూరంగా ఉంటాయి. మీరు మీ ఇంటి బయట ఈ మొక్కను నాటడం ద్వారా.. దోమలు సమీపంలో చేరవు.

బంతి పువ్వు
మేరిగోల్డ్ చాలా తేలికగా పెరిగే మొక్క. బంతి చెట్టుకు పూసే నారింజ, పసుపు పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల దోమలు రావు. దోమలు బంతి పువ్వుల వాసనను ఇష్టపడవు. వాటికి దూరంగా ఉండటానికి ఇష్టపడతాయి. అందువల్ల.. ఈ మొక్కలను మీ ఇంటి దగ్గర నాటడం వల్ల దోమల నివారణ తగ్గించుకోవచ్చు.

క్యాట్నిప్
క్యాట్నిప్ మొక్క ఎక్కడైనా సులభంగా పెరుగుతుంది. చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఈ మొక్కలు పుదీనా జాతికి చెందినది. ఈ మొక్క సువాసన దోమలను దూరంగా ఉంచుతుంది. మొక్క సంరక్షణకు పెద్దగా శ్రమ పడదు. అందువల్ల, మీరు మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలను సులభంగా నాటవచ్చు. ఈ మొక్క చాలా తేలికగా పెరుగుతాయి.

Exit mobile version