Hot Water Bath: క్రమంగా పెరిగిపోతున్న చలి తీవ్రత. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో.. శీతాకాలంలో స్నానం చేసేందుకు హాట్ వాటర్ ను ఉపయోగించడం చాలా సౌకర్యవంతమైంది. కానీ, ఈ అలవాటు శారీరక సౌఖ్యాన్ని అందించడమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అయితే, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
Read Also: Pushpa 2: ఆశీస్సుల కోసం మెగాస్టార్ నివాసానికి మైత్రీ నిర్మాతలు
వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
* వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం యొక్క సహజ తేమను తొలగించేస్తుంది. దీంతో చర్మం పొడిబారిపోతుంది. చికాకు, దురద, పగుళ్లు ఏర్పడే ఛాన్స్ ఉంది.
* వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, బీపీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే బీపీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు వేడి నీటితో స్నానం చేయొద్దు.
* వేడి నీళ్లతో స్నానం చేసిన తర్వాత కొందరికి తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు.. ఎందుకంటే శరీరం బలహీనంగా, అలసటగా మారుతుంది.
* ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల తలనొప్పి, డీహైడ్రేషన్, వికారం, మూర్ఛ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
Read Also: Kollywood: కోలీవుడ్లో అన్నీ రివర్స్.. బోల్తా పడ్డ స్టార్లు.. పైకెగిసిన యువ హీరోలు
వేడి నీటితో స్నానం చేయడం వల్ల లాభాలు..
* వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. తగ్గుతుంది.
* వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గి.. శారీరక ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే, శరీర రక్త ప్రసరణను పెంచుతుంది. దీని వల్ల ఆక్సిజన్, పోషకాలు అన్ని శరీర భాగాలకు సరిగ్గా చేరిపోతాయి.
* వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మ రంధ్రాలను తెరుస్తుంది.. మురికిని బయటకు పంపిస్తుంది. తద్వారా చర్మాన్ని క్లీన్ చేస్తుంది.
* వేడి నీళ్లతో స్నానం చేస్తే.. శరీరం మొత్తం ఉపశమనం పొంది.. దృఢత్వం, నొప్పి నుంచి రిలీఫ్ దొరుకుతుంది.