Holi 2026 Eye Safety Tips: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.. హోలీ సమయంలో మీ కళ్లలో కలర్స్ పడితే.. వెంటనే ఇలా చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holi 2026 Eye Safety Tips: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు.. అంటే మనకున్న ఇంద్రియాల్లో కళ్లు ఎంతో ప్రాముఖ్యమైనవి.. అయితే, హోలీ సమయంలో కళ్లలో గులాల్, ఇతర రసాయనాలు కలిపిన కలర్స్ పడితే.. ఎన్నో ఇబ్బందులు తప్పవు.. అయితే, రంగుల పండుగ హోలీ సందర్భంగా కళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… ఇప్పటి మార్కెట్లో లభించే కొన్ని సింథటిక్ రంగుల్లో లెడ్ ఆక్సైడ్, మెర్క్యురీ సల్ఫైట్, పిండిచేసిన గాజు వంటి హానికర రసాయనాలు ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి కళ్లలోకి వెళ్తే చికాకు, కార్నియా గాయాలు లేదా తీవ్రమైన అలెర్జీ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
కళ్లలో రంగు పడితే వెంటనే ఏం చేయాలి..?
– ముందుగా జనసమూహం నుంచి దూరంగా వెళ్లాలి..
– కళ్లను రుద్దకండి – రుద్దడం వల్ల చిన్న కణాలు లోపలికి వెళ్లి కార్నియాను గాయపరచవచ్చు.
– శుభ్రమైన, పారే నీటితో కంటిని సున్నితంగా కడగండి.
– మినరల్ వాటర్ ఉంటే దానితో కూడా కంటిని శుభ్రం చేయవచ్చు.
Also Read
- Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్‌కు వెళ్లాలా.?
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్‌గా తెలుసుకోండిలా..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
కళ్లలో రంగు పడితే ఏమి చేయకూడదు?
– రోజ్ వాటర్ వేయకండి
– పాలు లేదా ఇంటి చిట్కాలు ప్రయత్నించకండి
– డాక్టర్ సలహా లేకుండా డ్రాప్స్ వాడకండి
వైద్యుల సూచన ప్రకారం, మొదట నీటితో కడగడం తప్ప మరే ద్రవం ఉపయోగించకపోవడం మంచిది. రోజ్ వాటర్ వంటి ద్రవాల్లో ఉండే ప్రిజర్వేటివ్‌లు పరిస్థితిని మరింత తీవ్రం చేయవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి
– చూపు మసకబారడం
– కడిగినా తగ్గని తీవ్రమైన నొప్పి
– కంటిలో ఏదో చిక్కుకున్నట్టు అనిపించడం
– కనురెప్పల వాపు
– కన్ను పూర్తిగా తెరవలేకపోవడం
ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి..
– కళ్ల చుట్టూ కొబ్బరి నూనె లేదా కోల్డ్ క్రీమ్ పూయండి
– సన్ గ్లాసెస్ లేదా రక్షణ కళ్లజోడు ధరించండి
– పెద్ద గుంపుల్లో జాగ్రత్తగా ఉండండి
– సాధ్యమైనంత వరకు సేంద్రీయ (ఆర్గానిక్) రంగులు ఉపయోగించండి
– సురక్షితమైన రంగులతో ఆనందంగా హోలీ జరుపుకోవడం ఉత్తమ మార్గం.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!