Heart Health Tips: గుండె ఆరోగ్య రహస్యం ఇదే.. మంచి ఆహారంతో పాటు మంచి అనుబంధాలు కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Health Tips: గుండె జబ్బులకు వయస్సుతో సంబంధం లేకుండా పోయింది.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎప్పుడు గుండె పోటు వస్తుందో తెలియని పరిస్థితి.. అయితే, గుండె ఆరోగ్యంపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు వచ్చాయి.. తాజాగా, గుండె జబ్బులను నివారించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మాత్రమే సరిపోదని తాజా పరిశోధన వెల్లడిస్తోంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించడం కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు. మన రోజువారీ జీవనశైలి, సామాజిక సంబంధాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అధ్యయనం సూచిస్తోంది.
సాధారణంగా వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, నిరంతర మానసిక ఒత్తిడి వంటి అంశాలు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని మనకు తెలుసు. అయితే కుటుంబ సభ్యులు, స్నేహితులతో మనకున్న అనుబంధం కూడా గుండె ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన వివరాలు ‘BMC Public Health’ అనే వైద్య పరిశోధన పత్రికలో ప్రచురితమయ్యాయి.
Also Read
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
885 మందిపై పరిశోధన.. ఆసక్తికర విషయాలు
ఇరాన్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో మొత్తం 885 మందిని పరిశోధకులు పరిశీలించారు. వీరిలో ఇటీవల గుండె జబ్బులు ఉన్నట్లు నిర్ధారణ అయిన 489 మంది రోగులతో పాటు, గుండె జబ్బులు లేని 396 మందిని చేర్చారు. వీరి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మానసిక ఒత్తిడి, సామాజిక సంబంధాలు తదితర జీవనశైలి అంశాలను విశ్లేషించారు. గుండె జబ్బుల ముప్పును పెంచే అంశాలను గుర్తించడమే ఈ పరిశోధన ప్రధాన ఉద్దేశం.
గుండె జబ్బులున్నవారిలో సామాజిక అనుబంధం తక్కువ
ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గుండె జబ్బులు లేనివారితో పోలిస్తే గుండె జబ్బులు ఉన్నవారిలో జీవనశైలి ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సామాజిక అనుబంధం కూడా తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనం ప్రకారం.. గుండె జబ్బులు లేని వారి సగటు జీవనశైలి స్కోరు 169.4గా ఉండగా, గుండె జబ్బులు ఉన్నవారిలో ఈ స్కోరు 146.66గా నమోదైంది. ఆరోగ్యంగా ఉన్నవారిలో వ్యాయామ అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారం, తక్కువ మానసిక ఒత్తిడి, మెరుగైన సామాజిక సంబంధాలు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అవసరమే!
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం ఆహారం, వ్యాయామంపైనే దృష్టి పెట్టకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, స్నేహితులతో మాట్లాడటం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అలవాట్లు ఒంటరితనాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మొత్తం ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమని పరిశోధన సూచిస్తోంది. అయితే, ఇది కేస్-కంట్రోల్ అధ్యయనం మాత్రమేనని, సామాజిక సంబంధాలు తక్కువగా ఉండటం నేరుగా గుండె జబ్బులకు కారణమవుతుందని ఈ పరిశోధన నిరూపించలేదని గుర్తుంచుకోవాలి. కానీ ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం, మానసిక ప్రశాంతత, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి అనుబంధం కలిగి ఉండటం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఈ అధ్యయనం పేర్కొంది..
తాజావార్తలు
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
-
Heart Health Tips: గుండె ఆరోగ్య రహస్యం ఇదే.. మంచి ఆహారంతో పాటు మంచి అనుబంధాలు కూడా!
-
Virender Sehwag: “కుర్రోడు కుమ్మేశాడు”.. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
-
Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’