NTV Telugu Site icon

Alcohol: ఆల్కాహాల్ మానేస్తేనే మంచి నిద్ర.. కీలక అధ్యయనంలో వెల్లడి..

Alcohol

Alcohol

Alcohol: సాధారణంగా ఆల్కాహాల్ తాగితే మత్తులో మంచి నిద్ర వస్తుందని అందరు అనుకుంటారు. అయితే అది నిజం కాదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆల్కహాల్‌ని వదులుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుందని కీలక అధ్యయనంలో వెల్లడైంది. సాయంత్రం పూట ఒకటి లేదా రెండు మద్యపానీయాలను తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తు్న్నాయి. సాధారణంగా మద్యపానం తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపోవడానికి సాయపడొచ్చని కానీ ఇది రాత్రంత నిద్రా భంగానికి కారణమవుతుందని తెలిపింది.

‘‘నేషనల్ ఇన్‌స్టిట్యూడ్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూజ్ అండ్ ఆల్కహాలిజం’’ డైరెక్టర్ సీనియర్, సైంటిఫిక్ అడ్వైజర్ ఆరోన్ వైట్ ఈ విషయాన్ని ది వాషింగ్టన్ పోస్టుతో వెల్లడించారు. మద్యం మత్తు పోయిన తర్వాత ‘రీబౌండ్ ఎఫెక్ట్’ ఉంటుందని, దీని వల్ల కొంతమంది త్వరగా మేలుకుంటారని, మళ్లీ నిద్రపోయేందుకు ఇబ్బందిపడుతుంటారని వైట్ అన్నారు. 2022లో నిర్వహించిన ఒక పరిశోధన ఒక నెల రోజుల మద్యపానం తీసుకోవడం మానేసిన వారిని పరిశీలించింది. ఈ కాలంలో వారు నిద్రను మెరుగుపరుచుకున్నట్లు తేలింది. యూకేలో డ్రై జనవరి ఛాలెంజ్‌లో పాల్గొన్న 4000 మందికి పైగా వ్యక్తుల్లో 56 శాతం మంది తాము ఆల్కహాల్ లేకుండా మంచి నిద్రను అనుభవిస్తున్నట్లు తెలిపారు.

Read Also: Chiranjeevi: అక్కడ వచ్చింది మెగాస్టార్ రా.. ఎన్నేళ్లు అయినా ఆ క్రేజ్ తగ్గేదేలే

ఆల్కాహాల్ ఒక డ్రిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని తీసుకున్నప్పుడు కడుపు, చిన్న పేగుల ద్వారా శోషించబడుతుంది, రక్తప్రవాహంలో కలుస్తుంది. ఆ తర్వాత లివర్‌లోని ఎంజైమ్స్ ఆల్కహాల్‌ని జీవక్రియ చేస్తాయి. అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో మిగిలిన ఆల్కహాల్ శరీరం అంతా ప్రసరిస్తుంది. దీని వల్ల మెదడు మత్తుకు గురవుతుంది. నిద్ర వివిధ దశల ద్వారా ముందుకు సాగే ప్రక్రియ దెబ్బతింటుందని స్లీప్ మెడిసిన్ అండ్ ఇంటర్నేషనల్ మెడిసిన్ ఫిజిషియన్ అండ్ ఇండియానా స్లీప్ సెంటర్ డైరెక్టర్ అభినవ్ సింగ్ వివరించారు.

ఆల్కహాల్ని తగినంత జీవక్రియ చేయడానికి శరీరానికి అవసరమైన వ్యవధి మనం ఎంత మద్యం తీసుకున్నాం, ఎంత సమయం తీసుకున్నామనే వంటి కారణాలతో ప్రభావితమవుతుంటాయి. ఇవన్నీ నిద్రపై ప్రభావం చూపిస్తుంటాయి. ఈ పరిస్థితులు వ్యక్తులు మధ్య భిన్నంగా ఉండొచ్చు. అయినప్పటికీ నిద్ర సమయానికి మద్యం సేవించడం వల్ల నిద్రకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాధారణంగా ఉదయం ఒక గ్లాస్ మద్యం తీసుకుంటే అది నిద్రను ప్రభావితం చేయదు. అయితే రాత్రి వేళ డిన్నర్‌తో పాటు హాఫ్ బాటిల్ తీసుకుంటే దాని ప్రభావం ఉంటుంది’’ అని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రతినిధి, క్లినికల్ సైకాలజిస్ట్ జెన్నిఫర్ మార్టిన్ అన్నారు.