NTV Telugu Site icon

Health Tips: జామకాయ తింటే.. టైప్‌ 1 డయాబెటిస్‌ కంట్రోల్‌

Jama

Jama

ఒక మిలియన్‌ కంటే ఎక్కువ మంది పిల్లలు, యువత టైప్‌ 1 డయాబెటిస్‌తో ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అంచనాల ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో టైప్‌ 1 డయాబెటిస్‌ కేసులు ఉన్నాయి.

ICMR నివేదిక ప్రకారం, దేశంలో డయాబటిస్‌తో బాధపడేవారి సంఖ్య గత మూడు దశాబ్దాలలో 150% పెరిగింది. షుగర్‌ పేషెంట్లు ఎక్కువగా ఉన్న దేశంలో భారత్‌ది రెండో స్థానం, డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రతి ఆరవ వ్యక్తి భారతీయుడే.. అని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. భారతదేశంలో టైప్‌ 1 డయాబెటిస్‌ నివారణకు.. ICMR మొదటిసారి మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇన్సులిన్‌ హార్మోన్‌ను క్లోమగ్రంథి తయారు చేయకపోవటం వల్ల టైప్‌ 1 మధుమేహం వస్తోంది. ఈ తరహా మధుమేహం చిన్న వయసు (15ఏళ్లలోపు)పిల్లల్లో, పెద్దల్లోనూ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీరు జీవితాంతం ఇన్సులిన్‌ వాడాల్సిందే. దేశంలో టైప్‌-1 మధుమేహ బాధితుల సంఖ్య ఏటా 10 వేల వరకూ పెరుగుతోంది.

ప్రస్తుతం మన దేశంలో 2.5 లక్షల మంది వరకు బాధితులు ఉన్నారని నివేదికలు చెబుతుంది. జన్యుపరమైన సమస్యలే కాకుండా, అనేక అంశాల కారణంగా.. టైప్‌ 1 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఏ రకం డయాబెటిస్‌ అయినా, దానిని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా అవసరం. వేసవి కాలంలో మీ షుగర్‌ లెవల్‌ను కంట్రోల్‌ చేసుకోవడం చాలా అవసరం. సమ్మర్‌లో కొన్ని పండ్లు తింటే.. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అవేంటో చూసేయండి.

జామకాయ..
డయాబెటిక్ పేషెంట్స్‌ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. జామకాయ అలాంటి ఆహారాల్లో ఒకటి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం సమస్యను పరిష్కరించడంలో సహాపడుతుంది. జామకాయలోని విటమిన్ ఏ, సి రక్తంలోని చక్కెర స్థాయిని సులువుగా తగ్గిస్తాయి. షుగర్‌ పేషెంట్స్‌ జామకాయ రోజూ తింటే.. టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది.

BJP: ఉండవల్లికి విష్ణువర్ధన్‌రెడ్డి కౌంటర్.. ఊసరవెల్లి రాజకీయాలు కట్టిపెట్టండి