Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్‌లో పడ్డట్లే..

Milk

Milk

Milk: పాలు, చాలా మంచి ఆహారంగా పరిగణించబడుతుంది. ప్రతీరోజూ పాలు తాగడం వల్ల విటమిన్లతో పాటు కాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్ లభిస్తాయి. ప్రతీ రోజూ టీ, కాఫీ ఇలా ఏదో పానీయంలో పాలు తప్పకుండా ఉంటాయి. అయితే, అన్ని రకాల ఆహారాలను పాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల ఫుడ్‌తో పాలను కలిపి తీసుకుంటే అవి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందని, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం, చర్మ సమస్యలు, అసౌకర్యానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ క్రియ దెబ్బతింటుంది. లాక్టోస్ ఇన్‌లారెన్స్, పేగు సమస్యలు ఎదురవుతాయి. ఆయుర్వేదం ప్రకారం పాలను పులుపు, ఉప్పు, అధిక ప్రొటీన్ ఉన్న ఆహారంతో కలపకూడదు. ముఖ్యంగా 8 రకాల ఆహారాలతో పాలను తీసుకోకూడదు.

1) సిట్రస్ పండ్లు:

నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లతో పాలను కలిపి తీసుకోకూడదు. ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఈ పండ్లను పాలతో తీసుకుంటే కడుపులో పాలు విరిగిపోయేలా చేస్తాయి. దీని వల్ల ఎసిడిటీ, ఉబ్బరం, కడుపు బరువుగా అనిపించవచ్చు. పాలు, సిట్రస్ ఫ్రూట్స్‌కు మదధ్య కనీసం రెండు గంటల విరామం ఉండేలా చూసుకోవాలి.

2) చేపలు:

ఆయుర్వేదంలో అత్యంత అసాధారణంగా పరిగణించే ఆహారాల్లో పాలు, చేపల కలయిక ఒకటి. ఈ రెండు కలిస్తే విషపూరితంగా మారుతాయని చెబుతుంటారు. ఈ రెండింటి కలయిక జీర్ణక్రియకు ఆటంకం కలిగించవచ్చు.

3) అరటి పండ్లు:

అరటి పండ్లు మిల్క్‌షేక్‌లకు ఫేమస్. అయినప్పటికీ పాలతో అరటిపండ్లను కలిపి రోజూ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

4) మసాలా పదార్థాలు:

మసాలాలు అధికంగా ఉండే భోజనంతో పాలను తీసుకుంటే జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. మసాలాల వల్ల కలిగే మంటను తగ్గించేందుకు కొన్ని సార్లు పాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ రెండింటి కలయిక ఎసిడిటీకి దారి తీస్తుందని చెబుతున్నారు.

5) పుల్లని ఆహారం, పెరుగు:

ఊరగాయలు, చింతపండు, వెనిగర్ కలిగిన వంటకాలతో, పెరుగుతో పాలను కలిపి తీసుకోకపోవడం బెటర్. ఈ రెండు పదర్థాలు రెండు వేర్వేరు జీర్ణక్రియలకు గురవుతాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే కడుపులో ఇబ్బంది కలుగుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు పెరుగుతాయి.

6) ఉప్పు:

ఆయుర్వేదంలో ఉప్పు కలిగిన ఆహార పదార్థాలను పాలతో కలిపి తీసుకోవద్దు. చిప్స్, మన్‌కీన్ వంటి వాటిని పాలతో కలిపి తీసుకోవద్దని చెబుతున్నారు.

7) కర్బూజాలు:

పుచ్చకాయ, కర్బూజాలను పాలతో కలిపి తీసుకోవద్దు. పుచ్చకాయ త్వరగా జీర్ణమవుతుంది. వీటిని పాలతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మందగిస్తుంది.

8) ప్రొటీన్ ఆహారం:

మాంసం, గుడ్లు, బీన్స్ వంటి ప్రొటీన్ అధికంగా ఉండే హెవీ ఆహారాన్ని పాలతో కలిపి తీసుకోవద్దు. ఇది జీర్ణక్రియపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ఈ రెండు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. జీర్ణక్రియ తక్కువగా ఉన్నవారు ఈ రెండింటిని కలిపి తినకపోవడమే మంచిది.