ఇవి తినండి.. కోవిడ్ నుంచి త్వరగా కోలుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఎంట్రీ తర్వాత అందరూ తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చాయి.. మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం తినాలి.. కోవిడ్ బారినపడితే త్వరగా కోలుకోవడానికి ఏం తింటే మంచిది.. ఇంకా ఎలాంటి ఎక్సైజ్‌లు చేయాలి లాంటి అనేక టిప్స్‌ను సూచిస్తున్నారు నిపుణులు.. ఇక, కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు మరికొన్నిఆహార చిట్కాలు చెబుతున్నారు.. ముఖ్యంగా బాదం, కిస్మిస్లు, రాగులు, బెల్లం లాంటివి కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవడానికి దోహదపడతాయని వివరిస్తున్నారు..
ఇక బాదం, కిస్మిస్ల విషయానికి వస్తే నాలుగైదు బాదం పప్పులు, పది కిస్మిస్లను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానబెట్టిన కిస్మిస్లు శరీరంలో లైపేజ్ ఎంజైమ్‌ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి.. బాదం శరీరానికి తగిన పోషకాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.. ఇక, రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది.. కాబట్టి.. రాగులతో చేసిన దోశ వంటి వాటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు అవుతుంది.. వాటిలోని పాలీఫీనాల్స్ డయాబెటిక్ రోగులలో గ్లైసిమిక్ స్పందనలను తగ్గిస్తాయని.. వాటిలోని క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయంటున్నారు.. మరోవైపు బెల్లంలోని ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బీ, సీ అధికంగా ఉంటాయని.. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, ఈ, డీ, కే, క్యాల్షియం సమృద్ధిగా ఉంటుందని.. దీని మూలంగా జీర్ణశక్తి పెరగడంతో పాటు ఎముకలు గట్టిపడతాయన్నది నిపుణుల మాట. ఇక, రాత్రి సమయంలో తినే తిండిలో కిచిడి ఉండేలా చూసుకోవాలని.. దీనిలో పదిరకాల అమినో యాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని.. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిదంటున్నారు.. పలుచటి మజ్జిగ, సగ్గుజావ, రాగిజావ వంటివి తాగితి బెటర్ అని.. దానిమూలంగా శరీరంలో నీటి శాతాన్ని సమస్థితి ఉంటుందని చెబుతున్నారు.
Also Read
- Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
- Soft Foods for Seniors: దంతాలు లేని వారికి ఏ ఆహారం మంచిది? సులభంగా తినగలిగే పోషకాహారాల పూర్తి జాబితా
- Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి 'కాకరకాయ ఉల్లి కారం'.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
- Water Manifestation Technique: "నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్" అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Prahlad Joshi: ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు.. ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానం
-
Viswanath And Sons: వెడ్డింగ్ సాంగ్ తో వేడెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’.. సూర్య సర్ప్రైజ్తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
-
Germany plane crash: ఇంటి పైకప్పుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!