NTV Telugu Site icon

ఇవి తినండి.. కోవిడ్‌ నుంచి త్వ‌ర‌గా కోలుకోండి..

క‌రోనా ఎంట్రీ త‌ర్వాత అంద‌రూ తీసుకునే ఆహారంలో మార్పులు వ‌చ్చాయి.. మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం తినాలి.. కోవిడ్ బారిన‌ప‌డితే త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి ఏం తింటే మంచిది.. ఇంకా ఎలాంటి ఎక్సైజ్‌లు చేయాలి లాంటి అనేక టిప్స్‌ను సూచిస్తున్నారు నిపుణులు.. ఇక‌, కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు మ‌రికొన్నిఆహార చిట్కాలు చెబుతున్నారు.. ముఖ్యంగా బాదం, కిస్‌మిస్‌లు, రాగులు, బెల్లం లాంటివి కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని వివ‌రిస్తున్నారు..

ఇక బాదం, కిస్‌మిస్‌ల విష‌యానికి వ‌స్తే నాలుగైదు బాదం పప్పులు, పది కిస్‌మిస్‌లను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానబెట్టిన కిస్‌మిస్‌లు శరీరంలో లైపేజ్‌ ఎంజైమ్‌ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి.. బాదం శరీరానికి తగిన పోషకాలను అందిస్తుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.. ఇక‌, రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది.. కాబ‌ట్టి.. రాగులతో చేసిన దోశ వంటి వాటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు అవుతుంది.. వాటిలోని పాలీఫీనాల్స్‌ డయాబెటిక్‌ రోగులలో గ్లైసిమిక్‌ స్పందనలను తగ్గిస్తాయ‌ని.. వాటిలోని క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయంటున్నారు.. మ‌రోవైపు బెల్లంలోని ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బీ, సీ అధికంగా ఉంటాయ‌ని.. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, ఈ, డీ, కే, క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంద‌ని.. దీని మూలంగా జీర్ణశక్తి పెర‌గ‌డంతో పాటు ఎముకలు గట్టిపడతాయ‌న్న‌ది నిపుణుల మాట‌. ఇక‌, రాత్రి స‌మ‌యంలో తినే తిండిలో కిచిడి ఉండేలా చూసుకోవాల‌ని.. దీనిలో పదిరకాల అమినో యాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయ‌ని.. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిదంటున్నారు.. పలుచటి మజ్జిగ, సగ్గుజావ, రాగిజావ వంటివి తాగితి బెట‌ర్ అని.. దానిమూలంగా శరీరంలో నీటి శాతాన్ని సమస్థితి ఉంటుంద‌ని చెబుతున్నారు.