Ear Hole Tips: ఆడవారికి ఆభరణాలు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే వారు ధరించే కమ్మలు కూడా వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇలా కమ్మగా వేసుకునే వాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా రంధ్రాలు ఉండడం గమనిస్తూనే ఉంటాం. కొందరిలో ఇది సాధారణ పరిమాణంలో ఉంటే, మరికొందరిలో చెవి విరిగిపోయేంత వరకు సాగి ఉంటాయి. దీనికి కారణం వృద్ధాప్యం, బరువైన నగలు ధరించడం వల్ల రంధ్రాల పరిమాణం పెద్దదిగా మారుతుంది. ఈ పరిస్థితి కారణంగా, కొంతమంది డాక్టర్ వద్దకు వెళ్లి వాటిని చిన్నదిగా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం వేలల్లో ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే మూడు చిట్కాలను అనుసరించి సాగిన చెవి రంధ్రాలను సన్నగా చేసుకోవచ్చు.
Read also: Tattoos on Body: ఒంటిపై టాటూ వేసుకుంటే యమ డేంజర్..?
దాల్చిన చెక్క- కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ రెండిటిని ఉపయోగించి చెవి రంధ్రాలను చిన్నవిగా మార్చుకుందాం. ఇందుకోసం ముందుగా దాల్చిన చెక్కను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు చెవి రంధ్రాలకు పట్టించాలి. ఇదే పద్ధతిని వరుసగా వారం రోజులు పాటిస్తే సాగదీసిన చెవి రంధ్రాలు బిగుతుగా తయారవడాన్ని గమనించవచ్చు.
Read also: Drinking Water: నీళ్లు తక్కువగా తాగుతున్నారా..? అయితే సమస్యే..!
చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చే ప్రక్రియలో టూత్ పేస్ట్ మొదటి పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు టూత్‌పేస్ట్‌ని తీసుకుని చెవి హోల్‌కి రెండు వైపులా అప్లై చేయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా అనుసరించడం ద్వారా, చెవి రంధ్రాల పరిమాణం త్వరగా తగ్గిపోకుండా ఎవరూ ఆపలేరు.
Read also: SWAG Theatrical Trailer: నాలుగు తరాలను ఒక్క సినిమాలో చూపించడం.. హీరో విష్ణుకే సొంతం
మస్టర్డ్ ఆయిల్, టర్మరిక్ రెమెడీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీని కోసం, ఒక టేబుల్ స్పూన్ ఆవాల నూనెలో చిటికెడు పసుపు తీసుకుని, రాత్రి పడుకునే ముందు చెవి రంధ్రాలకు అప్లై చేయండి. ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీళ్లలో చర్మాన్ని బిగుతుగా మార్చే గుణం ఉంది కాబట్టి తరచుగా చల్లటి నీటితో చర్మాన్ని కడగడం మంచిది. ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా, సాగిన చెవి రంధ్రాలను ఎటువంటి ఖర్చు లేకుండా సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
Ravichandran Ashwin: ప్రపంచ క్రికెట్‌లో ఏకైక బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్!