Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ‘ఫెర్టీ9’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్‌వర్క్‌గా పేరుగాంచిన ‘ఫెర్టీ9‘ ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపును సాధించింది. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక శాస్త్రీయ వేదికలపై ఫెర్టీ9 వైద్య బృందం నిర్వహించిన పరిశోధనలు భారతీయ ఫెర్టిలిటీ వైద్యరంగానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ ఏడాది ESHRE 2026లో నాలుగు పరిశోధనా పత్రాలు, ఒక ఓరల్ ప్రజెంటేషన్, జపాన్‌లోని టోక్యోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో నాలుగు పరిశోధనా పత్రాలు, అలాగే ASPIRE సదస్సులో 11 పరిశోధనా పత్రాలను ఫెర్టీ9 వైద్య నిపుణులు సమర్పించారు.
గత ఐదేళ్ల IUI చికిత్సలపై చేసిన పరిశోధనలో ఆలస్య వివాహాలు, ఉద్యోగ జీవనశైలి, నైట్ షిఫ్ట్‌లు, మహిళల్లో హార్మోన్ల సమస్యలు, పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గడం, DNA ఫ్రాగ్మెంటేషన్ వంటి అంశాలు సంతానోత్పత్తిపై చూపుతున్న ప్రభావాన్ని విశ్లేషించారు. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణలో 1.8, ఆంధ్రప్రదేశ్‌లో 1.7గా నమోదైనట్లు ఫెర్టీ9 వెల్లడించింది.
Also Read
- Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
- Soft Foods for Seniors: దంతాలు లేని వారికి ఏ ఆహారం మంచిది? సులభంగా తినగలిగే పోషకాహారాల పూర్తి జాబితా
- Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి 'కాకరకాయ ఉల్లి కారం'.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
- Water Manifestation Technique: "నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్" అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
వైద్య నిపుణుల అభిప్రాయాలు:
డా. జ్యోతి, క్లినికల్ డైరెక్టర్, ఫెర్టీ9 కూకట్పల్లి మాట్లాడుతూ.. సంతాన సమస్యల విషయంలో దంపతులు ఆలస్యం చేయకుండా ముందుగానే అవగాహన పెంచుకుని, అవసరమైతే ప్రారంభ దశలోనే ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించడం ద్వారా విజయావకాశాలను పెంచుకోవచ్చని తెలిపారు.డా. సుమ, అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, ఫెర్టీ9 విజయవాడ మాట్లాడుతూ.. ప్రస్తుతం 30 సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తర్వాత ఫెర్టిలిటీ చికిత్స కోసం వచ్చే దంపతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. డా. అనూషా రెడ్డి, అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, ఫెర్టీ9 వరంగల్ మాట్లాడుతూ.. వంధ్యత్వ సమస్యల్లో 40–50 శాతం వరకు పురుషుల కారణాలే ఉంటున్నాయని, మహిళల్లో PCOS ప్రధాన కారణంగా కొనసాగుతోందని తెలిపారు. అలాగే గత కొన్నేళ్లలో ఎగ్ ఫ్రీజింగ్‌పై ఆసక్తి రెండు నుంచి మూడు రెట్లు పెరిగిందని వెల్లడించారు.
కేంద్రాల వారీగా వైద్యుల సందేశాలు:
ఫెర్టీ9 కూకట్పల్లి: డా. జ్యోతి సి. బుడి, డా. ఉషా బృందిని, డా. సాహితి మాట్లాడుతూ.. సంతాన సమస్యలపై అవగాహన పెరగడం, ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించడం, ఆధునిక ఫెర్టిలిటీ చికిత్సలను సమయానికి ప్రారంభించడం ద్వారా విజయవంతమైన గర్భధారణ అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
ఫెర్టీ9 బంజారాహిల్స్: డా. విజయ మాధురి, డా. శ్రావ్య మాట్లాడుతూ.. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన చికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ సేవలను అందిస్తూ ప్రతి దంపతికి ఆశను కల్పిస్తున్నామని తెలిపారు.
ఫెర్టీ9 సికింద్రాబాద్ (ఎన్సీఎల్): డా. మృదుల ప్రియాంక పి., డా. కె. హారికా రెడ్డి, డా. సంధ్య దీపిక ఒరుగంటి, డా. తేజస్విని నేసే మాట్లాడుతూ.. ఆలస్య వివాహాలు, ఉద్యోగ ఒత్తిడి, జీవనశైలి మార్పుల వల్ల పెరుగుతున్న సంతాన సమస్యలకు సరైన సమయంలో నిపుణుల చికిత్సే ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు.
ఫెర్టీ9 ఎల్బీ నగర్: డా. మౌనిక సోరకాయలపేట, డా. శృతి మంత్రీ మాట్లాడుతూ.. ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకోవడం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స పొందడం ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు.
ఫెర్టీ9 వరంగల్: డా. అనూష కూషణపల్లి మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, PCOS, పురుషుల్లో వీర్య నాణ్యతలో మార్పులు వంటి కారణాల వల్ల వంధ్యత్వ సమస్యలు పెరుగుతున్నప్పటికీ, ఆధునిక వైద్య సాంకేతికతతో వాటిని విజయవంతంగా అధిగమించవచ్చని తెలిపారు.
ఫెర్టీ9 కరీంనగర్: డా. బిజి బి. పిళ్లై, డా. వేణుకొంటి మీనశ్రీ మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ సంతాన సమస్యలపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, సమయానికి చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు.
ఫెర్టీ9 విజయవాడ: డా. సుమ వర్ష మాట్లాడుతూ.. ఆలస్యంగా కుటుంబాన్ని ప్రారంభించాలనే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో యువ దంపతులు ఫెర్టిలిటీ ఆరోగ్యంపై ముందుగానే శ్రద్ధ వహించాలని సూచించారు.
ఫెర్టీ9 విశాఖపట్నం: డా. కావ్యా రెడ్డి కుమ్కల, డా. పాల కీర్తి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం, వ్యక్తిగత వైద్య సంరక్షణతో ప్రతి దంపతికి అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.
ఫెర్టీ9 రాజమహేంద్రవరం: డా. అశ్విని వుయ్యూరి, డా. సౌమ్య వరుడు మాట్లాడుతూ.. పెరుగుతున్న జీవనశైలి సమస్యల మధ్య సరైన సమయంలో ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించడం ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశాలను గణనీయంగా పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
ఫెర్టీ9 తిరుపతి: డా. సునీత సాధు, డా. శ్రీదుర్గ ఎన్. మాట్లాడుతూ.. అత్యాధునిక ఫెర్టిలిటీ చికిత్సలు, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలతో దంపతులకు ఉత్తమ ఫలితాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఫెర్టీ9 కర్నూలు: డా. ఆర్. సుశ్రుత మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంతాన సమస్యలపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, ఆధునిక చికిత్సలతో వంధ్యత్వ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
నీడిల్-ఫ్రీ IVF సేవలు:
ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫెర్టీ9 తన అన్ని 11 కేంద్రాల్లో నీడిల్-ఫ్రీ IVF సేవలను ప్రారంభించింది. దీని ద్వారా రోజువారీ ఇంజెక్షన్ల వల్ల కలిగే నొప్పి, భయాన్ని తగ్గిస్తూ రోగులకు మరింత సౌకర్యవంతమైన చికిత్సను అందిస్తోంది. అదేవిధంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ప్రజనన ఆరోగ్య పరిశోధనలపై కూడా ఫెర్టీ9 విస్తృతంగా పనిచేస్తోంది. IVF విజయశాతాన్ని పెంచడం, ఇంప్లాంటేషన్ వైఫల్యాలను తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఇంప్లాంటేషన్ వైఫల్యాలు, గర్భస్రావాల నివారణ కోసం ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసి మరింత అధునాతన ఫెర్టిలిటీ సేవలను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఫెర్టీ9 గురించి:
ఫెర్టీ9 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హైదరాబాద్ (కూకట్పల్లి, బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్), వరంగల్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు నగరాల్లో మొత్తం 11 అత్యాధునిక ఫెర్టిలిటీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. ప్రపంచ స్థాయి సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, పరిశోధన ఆధారిత చికిత్సా విధానాలు, రోగి-కేంద్రిత సేవలతో వేలాది మంది దంపతుల తల్లిదండ్రుల కలను సాకారం చేస్తూ ఫెర్టిలిటీ రంగంలో విశ్వసనీయ సంస్థగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Explainer: రాత్రికి రాత్రే దాడి.. కంట్రోల్ తప్పిన ఏఐ..దెబ్బకు కథ అడ్డం తిరిగింది!
-
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
-
Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ‘ఫెర్టీ9’!
-
Vivo V40e 5G: స్టైలిష్ డిజైన్, 50MP సోనీ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. వివో V40e 5G ప్రీమియం స్మార్ట్‌ఫోన్
-
OTT Trending Movie: టాప్ ట్రెండింగ్ లో100 కోట్ల సినిమా.. ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ కామెడీ..
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!