Site icon NTV Telugu

Multani mitti Face Beauty: అందమైన ముఖం కోసం సింపుల్ చిట్కా

Multani Mitti Face Beauty

Multani Mitti Face Beauty

Multani mitti Face Beauty: ప్రతి ఒక్కరూ అందమైన ముఖం కలిగి ఉండాలని కోరుకుంటారు. అందమైన ముఖం కలిగి ఉండటం వల్ల సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. అయితే ముఖం అందంగా కనిపించాలంటే శరీరానికి హైడ్రేషన్ అవసరం. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్కిన్ బ్యూటీషియన్లు చెబుతున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ముఖాన్ని మెరిసేలా ఉంచుకోవడం చాలా మందికి పెద్ద సవాల్‌గా మారింది. ముఖ సౌందర్యం, చర్మసౌందర్యం కోసం రకరకాల సహజసిద్ధమైన పద్ధతులను అనుసరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాల రుచిని పెంచేందుకు పెరుగును ఉపయోగిస్తారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కానీ ముఖానికి, చర్మ సౌందర్యానికి ఈ పెరుగు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Read also: Students Struggle For Bus: బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు.. ఉద్రిక్తత

ఇది చర్మంపై తేమను పెంచడమే కాకుండా, ముఖంపై చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది చర్మంపై నల్ల మచ్చలను కూడా తొలగిస్తుంది. అయితే దీని కోసం ముందుగా పెరుగు తీసుకోండి.. పెరుగును రాత్రిపూట ముఖానికి పట్టించి 20 తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ముఖంపై నలుపు తగ్గడమే కాకుండా చర్మం అందంగా కనిపిస్తుంది. ముల్తానీ మిట్టి శతాబ్దాల నుండి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులోని గుణాలు చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా కాంతివంతంగా మార్చుతాయి. ఈ మట్టిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి కళ్లకింద నల్లటి వలయాలు ఉన్న చోట రాసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలుంటాయని స్కిన్ బ్యూటీషన్లు అంటున్నారు. ఇది ముఖంపై మొటిమలను కూడా నియంత్రిస్తుంది. దీని కోసం ముల్తానీ మిట్టిని పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని రోజూ ముఖానికి పట్టించాలి. దీంతో ముఖానికి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి.
Tiger Route Changed: మహారాష్ట్రకు మకాం మార్చిన కొత్త పులి

Exit mobile version