NTV Telugu Site icon

Love Failure: లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అంత బాధగా ఉంటుంది..? శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే..

Heartbreak

Heartbreak

Experts Explain The Science Behind Why Heartbreak Hurts So Much: ప్రేమలో పడటం చాలా మధురమైన అనుభూతి. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రేమ ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, లేకపోతే మనం ఎంతో ప్రేమించే వారు దూరం కావడం, చనిపోవడం వంటి విషయాల్లో చాలా ఎక్కువ మనోవేధన అనుభవిస్తారు. ఆ బాధ మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు శారీరకంగా, మానసికంగా చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. భావోద్వేగ పరిస్థితుల్లో అనుభవించే బాధ చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

దీని వెనక సైన్స్ ఉందని చెబుతున్నారని శాస్త్రవేత్తలు. ఇంగ్లాండ్‌లోని డాక్టర్ ఫాక్స్ ఆన్‌లైన్ ఫార్మసీకి వైద్య రచయిత డాక్టర్ డెబోరా లీ ప్రకారం.. మీరు ప్రేమ పడినప్పుడు సహజంగా కొన్ని హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. వీటిలో ‘కడిల్’ హార్మోన్ ఆక్సిటోసిన్, ‘ఫీల్ గుడ్’ హార్మోన్ డోపమైన్ ఉంటాయి. ఇవి మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. అయితే మీరు లవ్ ఫెయిల్యూర్ లో ఉంటే ఈ రెండు హర్మోన్ స్థాయిలు శరీరంలో తగ్గిపోతాయి. ఆదే విధంగా ఒత్తడికి కారణమయ్యే హార్మోన్లలో ఒకటైన ‘కార్టిసాల్’’ స్థాయిలు పెరుగుతాయి.

Read Also: Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు

కార్టిసాల్ హార్మోన్ హై బీపీ, బరువు పెరగడానికి, మెటిమలకు, ఆందోళనకు కారణం అవుతుంది. లవర్ తో విడిపోయినప్పుడు సామాజిక తిరస్కరణ, శారీరకంగా నొప్పిని అనుభవించే మెదడులోని ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితుల వల్ల గుండె కూడా ప్రభావితం అవుతుందని లీ చెప్పారు. టుకోట్సబో కార్డియోపతి దీన్ని ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ ని పిలువబడే కండిషన్ ఏర్పడుతుంది. దీన్ని తెలుసుకోవాలంటే యాంజియోగ్రామ్ పనిచేస్తుంది.

సాధారణంగా ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ తీవ్రమైన ఒత్తిళ్ల వల్ల మాత్రమే సంభవిస్తుంది. సాధారణంగా ఒకసారి మాత్రమే సంభవిస్తుంది. చాలా మంది వ్యక్తులు కొన్ని రోజుల్లో లేదా వారాల తర్వాత దీన్ని అధిగమించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి వల్ల మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది. రిలేషన్స్ బ్రేక్ అయినప్పుడు అనుభవించే నొప్పి మానవ జీవితంలో పరిణామం చెందిన లక్షణం అయి ఉండొచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం.

Show comments