NTV Telugu Site icon

Avoid Salt: ఉప్పు ముప్పే.. తినేటప్పుడు అదనంగా ఉప్పు వేసుకుంటే..

Avoid Salt

Avoid Salt

Avoid Salt: ఉప్పు లేని జీవితం పప్పుతో సమానం. అంటే పప్పు సప్పగా ఉంటుంది సప్పగా ఉండే తిండి తినడం దండగా అని నిర్ధాణకు వచ్చేశారన్నమాట మన భోజనప్రియులు. ఉప్పు లేని వంటకాన్ని మనం ఊహించలేము. మనం చేసే ప్రతి వంటలోనూ ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. లేదంటే ఆ వంటకు రుచి ఉండదు. అయితే కొందరు ఉప్పును ఎక్కువగా తీసుకుంటారు. వారు ఉప్పు ఉంటేనే ఆహారం ఇష్టపడతారు. మనం తినే టప్పుడు ఉప్పు డబ్బాను పక్కన పెట్టుకుని తినేంతగా వచ్చేశాము. తినే ఆహారంలో ఉప్పు కాస్త తగ్గిన సహించలేము. ఉప్పు డబ్బా తీసుకుని అన్నంలో చల్లేసుకుంటుంటాము. ఇక పెరుగు అన్నంలో ఉప్పు ఉండాల్సిందే. అన్నంలో ఉప్పు ఉన్నా దానికి మించి తినేస్తుంటారు కొందరు అయితే అలా తినడం వల్ల చాలా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది. దీని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల ప్రకారం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. WHO ప్రకారం, అధిక ఉప్పు గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు దారి తీస్తుంది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 25 లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చు. అలాగే, శరీరం సోడియం పొందాలి. కానీ, రోజూ ఉప్పు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవడం కూడా ప్రమాదకరం. కానీ, చాలా మంది రోజుకు ఎంత ఉప్పు తింటే మంచిది? అంటుంటారు. కానీ.. ఉప్పు ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. ఈ నేపథ్యంలో ఉప్పు ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో WHO తాజాగా వెల్లడించింది.

Read also: Kurnool Live: కర్నూలులో రాయలసీమ గర్జన లైవ్ అప్‌డేట్స్

WHO మార్గదర్శకాల ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి గుండె జబ్బులు, గుండెపోటు, కిడ్నీ సమస్యలు రావడం ఖాయం. ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం కారణంగా ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారు. అందువల్ల ఉప్పును తగ్గించడం ద్వారా ఏటా దాదాపు 25 లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని ఆ సంస్థ అభిప్రాయపడింది. 2025 నాటికి ప్రపంచంలో సోడియం ఉప్పు వినియోగాన్ని 30 శాతం తగ్గించడమే లక్ష్యం. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉప్పు ఎక్కువగా వస్తోందని అంటున్నారు. అయితే, దేశాల ప్రకారం ఈ ఆహారంలో ఉప్పు పరిమాణంలో చాలా తేడాలు ఉన్నాయని చెప్పబడింది. ఈ నేపథ్యంలో ఉప్పు వినియోగం ఇటీవల నిర్దేశించిన మోతాదులోనే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వంటకాలు రుచి తక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ ఉప్పు తక్కువగా తింటే మంచిది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తినే వారు ఖచ్చితంగా జాగ్రత్తగా వాడాలి. లేదంటే ఆరోగ్యానికి ముప్పు.
Avoid Salt: ఉప్పు ముప్పే.. అన్నం తినేటప్పుడు ఉప్పు ఎక్కువ వేసుకుంటే..