చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అన్ని ఏజ్ గ్రూపుల వారు ఇష్టంగా తింటుంటారు. అయితే చాక్లెట్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సాధారణంగా చెబుతారు. కానీ, డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును నియంత్రించడానికి, మానసిక స్థితిని బలపరచడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, మాంగనీస్, పొటాషియం, సెలీనియం, భాస్వరం ఉంటాయి.
Also Read:Himachal: రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఆగ్రహం..
డార్క్ చాక్లెట్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ చాక్లెట్ యొక్క ప్రయోజనాలు ముడి లేదా ప్రాసెస్ చేయని బీన్స్ లేదా కోకో నుంచి తయారుచేసినప్పుడు మాత్రమే లభిస్తాయి. ఈ చాక్లెట్ తినడం ద్వారా శరీరానికి ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. డార్క్ చాక్లెట్ ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. దీన్ని తినడం ద్వారా హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. డార్క్ చాక్లెట్‌లో లభించే యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ లో కేలరీలు చాలా తక్కువ. చక్కెర పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
Also Read:Officer on Duty Trailer: మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు ట్రైలర్ విడుదల..
డార్క్ చాక్లెట్ వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుందని భావిస్తారు. డార్క్ చాక్లెట్‌లో లభించే ఐరన్, రాగి, మెగ్నీషియం మొదలైన పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారు డార్క్ చాక్లెట్ తింటే బాగా నిద్రపోవచ్చు. అయితే డార్క్ చాక్లెట్ ను ప్రతిరోజు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కారణం అందులో ఉండే కెఫిన్. దాదాపు 100 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ 80 మి.గ్రా వరకు ఉంటుంది. దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. డార్క్ చాక్లెట్‌లో థియోబ్రోమిన్ ఉంటుందని, దీన్ని ఎక్కువగా తినడం వల్ల తలనొప్పి లేదా ఫియర్ వంటి సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.