ఈరోజుల్లో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అధిక బరువు పెరుగుతున్నారు.. తిన్న ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.. బరువు పెరగడం, పొట్ట రావడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది. అధిక బరువు కారణంగా గుండె సమస్యలు రావడంతో పాటుగా, అధిక రక్తపోటు, ఉబకాయం కూడా వస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రుళ్లు తినేవాటిలో ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉండాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం రాదు. అందుకే, మంచి ఫుడ్స్‌ని ఎంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
READ NORE: Srisailam: భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం
రాత్రుళ్లు తినే బెస్ట్ ఫుడ్‌లో ఓట్స్ ముందుంటుంది. పాలు లేదా నీళ్లతో తయారు చేసుకుని తినొచ్చు. లేదంటే ఓట్స్‌తో దోశ, ఇడ్లీ వంటివి కూడా ట్రై చేయొచ్చు. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. బరువు తగ్గడానికి సహాయ పడతాయి. మరో ఆహార పదార్థం కిచిడీ.. దీన్ని ఎక్కువగా ఉడికించడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. కూరగాయలు యాడ్ చేయడం వల్ల ఫైబర్ పుష్కలంగా అందుతుంది.
బరువు తగ్గించడంలో దాలియా కూడా ముందుంటుంది. దీనిని గోధుమ రవ్వతో కలిపి చేస్తారు. ఇందులో పెసరపప్పు కలపడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా, ఇష్టమైన కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. దీని వల్ల జీర్ణ సమస్యలు రావు. ఈజీగా బరువు తగ్గుతారు. సూప్స్ కూడా మంచి డిన్నర్ రెసిపీ. అయితే, కొంతమందికి సూప్ తాగడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపించదు. అలాంటివారు అందులో ఎక్కువగా గ్రీన్ పీస్, క్యారెట్, కార్న్ వంటివి యాడ్ చేయొచ్చు. దీని వల్ల కూడా చాలా వరకూ కడుపు నిండుతుంది. ఈజీగా జీర్ణమవుతుంది. హ్యాపీగా బరువు తగ్గుతారు.