Site icon NTV Telugu

Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

Ear

Ear

Ear Care Tips in Telugu: మనం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన వినికిడి శక్తిని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే చెవుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. చాలా మంది చెవులలో వచ్చే చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఈ అలవాట్లు భవిష్యత్తులో శాశ్వత వినికిడి లోపానికి (Hearing Loss) దారితీయవచ్చు. ఆ అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాటన్ బడ్స్‌ను లోపలికి పెట్టకండి
చెవిలో దురదగా అనిపించినప్పుడు చాలా మంది కాటన్ బడ్స్‌ను ఉపయోగిస్తారు. అయితే, వీటిని చెవి లోపలికి పెట్టడం వల్ల చెవిలోని వ్యాక్స్ (Ear wax) బయటకు వచ్చే బదులు మరింత లోపలికి నెట్టబడుతుంది. దీనివల్ల చెవిలో అడ్డంకులు (Blockage) ఏర్పడటమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ల ప్రకారం, కాటన్ బడ్స్‌ను కేవలం చెవి వెలుపలి భాగాన్ని శుభ్రం చేయడానికి మాత్రమే వాడాలి.

Richest People: కుబేరుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్.. మొదటి స్థానంలో ఎలాన్ మస్క్.. ఇండియా నుంచి ఎవరంటే..

వైద్యుల సలహా లేకుండా నూనె వేయకండి
చెవిలో నూనె వేయడం మంచిదని కొందరు నమ్ముతారు. కానీ ఇది తప్పు. చెవిలో నూనె వేయడం వల్ల బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సమస్య ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా నేరుగా ఇఎన్‌టి (ENT) నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

అధిక శబ్దంతో సంగీతం
హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌ల ద్వారా గంటల తరబడి బిగ్గరగా సంగీతం వినడం వినికిడి శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా ’60/60′ రూల్‌ను పాటించాలి. అంటే, వాల్యూమ్‌ను 60 శాతం కంటే తక్కువగా ఉంచాలి , ప్రతి 60 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి. డీజేలు, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే ప్రదేశాల్లో చెవులకు రక్షణగా ఇయర్ ప్లగ్స్ వాడటం మంచిది.

సొంత మందులు వాడటం
చెవిలో నొప్పి లేదా ఏదైనా ద్రవం కారుతుంటే మెడికల్ షాపుల్లో దొరికే ఇయర్ డ్రాప్స్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడకండి. అలాగే కడ్డీలు, హెయిర్ పిన్స్ వంటి పదునైన వస్తువులతో చెవిని గీకడం వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు అకస్మాత్తుగా వినికిడి తగ్గడం లేదా తల తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Gas Booking Scam : ఫాస్ట్ డెలివరీ అంటూ కేటుగాళ్ల ‘గ్యాస్ బుకింగ్’ లింక్.. క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ..!

Exit mobile version