NTV Telugu Site icon

Dengue in Karnataka: కర్ణాటకలో డెంగ్యూ కలకలం..రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు

World Dengue Day

World Dengue Day

కర్ణాటకలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించి పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు. డెంగ్యూ వ్యాప్తిని పర్యవేక్షించడానికి.. నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి తాలూకాలో టాస్క్‌ఫోర్స్ మరియు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ.. ‘జనవరి నుంచి రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూతో ఇద్దరు చిన్నారులు మృతి చెందుతున్నారు. ప్రతిరోజు డెంగ్యూతో మూడు నుంచి నాలుగు మరణాలు నమోదవుతున్నాయి. ఇది బాధాకరం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నా.. ప్రభుత్వం మాత్రం సరిగ్గా స్పందించడం లేదు.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Goa: వాటర్‌ఫాల్స్‌ వద్ద చిక్కుకున్న పర్యాటకులు.. 50 మంది రెస్క్యూ, మరో 30 మంది కోసం..

ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. వైద్యులతో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 100 శాంపిల్స్‌ పరీక్షించగా 13-14 శాతం డెంగ్యూ పాజిటివ్‌గా తేలిందని ఆయన వెల్లడించారు. కో-మోర్బిడిటీ ఉన్నవారిలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు వెల్లడైనట్లు తెలిపారు. తనకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షల మందికి పైగా డెంగ్యూ సోకినట్లు అంచనా వేశారు. విచారణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలన్నారు. పరీక్ష కోసం రూ. 600-1,000 వసూలు చేస్తున్నారని.. పేద ప్రజలు పరీక్షలు చేయించుకోకపోతున్నారని తెలిపారు.