Multivitamins: కొంతమంది రోజూవారీగా మల్టీవిటమన్లను తీసుకుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, వ్యాధుల బారిన పడమని అనుకుంటారు. అయితే ఇలా రోజు మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ కాలం జీవించడంతో సాయం చేయడని, వాస్తవానికి ముందస్తు మరణాన్ని పెంచే అవకాశం ఉందని ఒక అధ్యయనం కనుగొంది. జేఏఎంఏ నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, దాదాపుగా 4 లక్షల మంది ఆరోగ్యవంతులైన పెద్దలపై 20 ఏళ్లకు పైగా పరిశీలన జరిపి ఈ విషయాన్ని వెల్లడించింది.
దీర్ఘాయువును మెరుగుపరచడానికి మల్టీవిటమిన్లు సహాయం ఉండదని కనుగొన్నారు. ఆశ్చర్యకరంగా ఎక్కువగా జీవించే బదులు, మల్టీవిటమిన్లు తీసుకున్న వారి కన్నా తీసుకోని వారి కన్నా ముందే చనిపోయే అవకాశం 4 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. డాక్టర్ ఎరిక్కా లాఫ్ట్‌ఫీల్డ్ మరియు మేరీల్యాండ్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌లోని ఇతర అసోసియేట్స్ అమెరికా ఆరోగ్య అధ్యయనాల నుంచి డేటా విశ్లేషించారు. 1990 నుంచి మల్టీవిటమిన్లు తీసుకునే వారి వివరాలను సేకరించారు. 20 ఏళ్లకు పైగా దాదాపుగా 4 లక్షల మంది వివరాలను తీసుకున్నారు.
Read Also: Indian Bison : నల్లమలలో 150 ఏళ్ల తర్వాత అనుకోని అతిధి.. సంబరపడిపోతున్న జంతు ప్రేమికులు..
రోజూవారీ మల్టీవిటమిన్ల వినియోగం మరణ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధన ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. వాస్తవాని ఇలా మల్టీవిటమిన్లు వాడే వారు వాడని వారి కన్నా 4 శాతం అధిక మరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. విటమిన్లు నిర్దిష్ట సందర్భాల్లో మాత్రమే ఉపయోగంగా ఉంటాయని పరిశోధకులు చెప్పారు. ఉదాహరణకు నావికులు స్కర్వీ నుంచి రక్షించబడటానికి విటమిన్ సీని తీసుకుంటారు. బీటా కెరోటిన్, విటమిన్ సీ, ఇ, జింక్ వంటివి వయసు సంబంధిత మచ్చలను క్షీణింపచేస్తాయి. మల్టీ విటమిన్లను తీసుకునే బదులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని, సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్‌ని పరిమితం చేస్తూనే మైక్రోన్యూట్రిషియంట్స్‌ని, పీచు పదార్థాలను తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. మన ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడంతో పాటు రెడ్ మీట్‌ని తగ్గించాలని సూచించారు.