Site icon NTV Telugu

Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

Crack Hills

Crack Hills

చాలామంది ఎదుర్కొనే ప్రధాన సౌందర్య , ఆరోగ్య సమస్యల్లో పాదాల పగుళ్లు ఒకటి. పాదాల చర్మం అతిగా పొడిబారినప్పుడు మడమల వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఆరంభంలో ఇవి చిన్నవిగా ఉన్నా, సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి లోతుగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి, దీనివల్ల నడక కూడా కష్టతరమవుతుంది. ఈ సమస్యకు ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయని నిపుణులు వివరించారు. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో ‘వాత దోషం’ అసమతుల్యత వల్ల చర్మం పొడిబారి ఇలాంటి పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా గరుకుగా ఉన్న నేలపై చెప్పులు లేకుండా నడవడం, ఎక్కువ సమయం నిలబడి ఉండటం, చలి , పొడి వాతావరణానికి పాదాలు గురికావడం వల్ల ఈ సమస్య వస్తుంది. వీటితో పాటు శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) , చర్మంపై ఉండే సహజ నూనెలను తొలగించే కఠినమైన సబ్బులను వాడటం వల్ల కూడా పాదాలు పగులుతాయి.

Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇంటి వద్దే పాటించదగ్గ కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఎంతగానో తోడ్పడతాయి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా వేపాకులను వేసి, ఆ నీటిలో పాదాలను 10-15 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలాగే త్రిఫల చూర్ణాన్ని నీటిలో ఉడికించి ఆ కషాయంలో పాదాలను ఉంచడం వల్ల పగుళ్లు త్వరగా మానిపోతాయి. పాదాలు నానిన తర్వాత ప్యూమిస్ స్టోన్ (Pumice stone) తో మృదువుగా రుద్దితే మృతకణాలు తొలగిపోతాయి. చర్మానికి పోషణ అందించడానికి నువ్వుల నూనె, వేప నూనె లేదా ఆవు నెయ్యిని కొద్దిగా పసుపుతో కలిపి పాదాలకు మసాజ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో పాదాలను మసాజ్ చేసి సాక్స్ వేసుకోవడం వల్ల పగుళ్ల తీవ్రత త్వరగా తగ్గుతుంది. బియ్యం పిండి, తేనె , ఆపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తయారుచేసిన స్క్రబ్‌తో పాదాలను రుద్దడం వల్ల కూడా చర్మం సున్నితంగా మారుతుంది.

iPhone: ఐఫోన్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..

ముందస్తు జాగ్రత్తగా ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ రాయడం అలవాటు చేసుకోవాలి. బయట తిరిగేటప్పుడు చెప్పులు లేకుండా నడవకూడదు. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవడంతో పాటు ఆహారంలో నెయ్యి, సూప్‌లు వంటి పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా ఉండి పగుళ్లు రాకుండా కాపాడుతుంది. నిరంతరం పాదాల పరిశుభ్రతను పాటిస్తూ ఈ ఆయుర్వేద పద్ధతులను అనుసరిస్తే పాదాల పగుళ్ల సమస్య నుండి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు.

Exit mobile version