NTV Telugu Site icon

Vaccines: టీబీ నుంచి డెంగ్యూ వరకూ టీకాలు.. 8 కొత్త వ్యాక్సిన్‌ల పరీక్షకు పర్మిషన్..!

Vaccine

Vaccine

Vaccines: టీకాలతో కరోనాకు నిలవురించడంలో సక్సెస్ సాధించిన తర్వాత ఇతర అంటు వ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం 8 కొత్త వ్యాక్సిన్‌లను పరీక్షించడానికి పర్మిషన్ ఇచ్చింది. కాగా, ఇందులో టీబీ నుంచి డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ వరకూ టీకాలు రెడీ చేస్తున్నారు. ఈ ఎనిమిదింటిలో నాలుగు వ్యాక్సిన్‌లు తుది దశకు చేరుకున్నాయి. ఈ టీకాల సాయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వచ్చే రెండేళ్లలో ఈ టీకాల పరీక్షలన్నీ పూర్తి కానున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం ఆరు ఫార్మా కంపెనీలకు 8 వేర్వేరు వ్యాక్సిన్‌లపై ట్రయల్స్ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన నిపుణుల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్‌ఈసీ) సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: 35 Chinna Katha Kaadu Review: 35 చిన్న కథ కాదు రివ్యూ

కాగా, హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్- ఈ కంపెనీకి డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బీ (ఆర్‌డిఎన్‌ఎ), ఇన్‌యాక్టివేటెడ్ పోలియోమైలిటిస్, హేమోఫిలస్ ఇన్‌ఫ్లుఎంజా టైప్ బి వ్యాక్సిన్‌లపై ఫేజ్- II ట్రయల్స్ చేసేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. న్యూమోకాకల్ పాలీశాకరైడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కూడా ఈ కంపెనీ పర్మిషన్ తీసుకుంది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ న్యుమోకాకల్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అలాగే, డెంగ్యూ వ్యాక్సిన్‌పై మూడవ దశ ట్రయల్‌ నిర్వహించేందుకు పనేసియా బయోటెక్ కంపెనీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also: Simbaa OTT: ఓటీటీలోకి అనసూయ క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అలాగే, టీబీ ఇన్‌ఫెక్షన్ నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా బీసీజీ వ్యాక్సిన్‌పై పని చేస్తుంది. ఇందులో భాగంగానే టీబీ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. ట్రయల్‌లోని ప్రాథమిక ఫలితాల ఆధారంగా సీడీఎస్‌సీఓ దశ- III ట్రయల్‌ను స్టార్ట్ చేసేందుకు కూడా అనుమతిని ఇచ్చింది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వీ)తో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతోందని సీడీఎస్‌సీఓ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు. ఇది ఊపిరితిత్తులు, శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లకు తీవ్ర కారణమౌతుంది. దీనికి కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ జాబితాలో చోటు దక్కింది. దీని కోసం మూడవ దశ ట్రయల్‌కు జీఎస్‌కే కంపెనీకి పర్మిషన్ దొరికింది.

Show comments