Site icon NTV Telugu

Cancer Prevention Foods: క్యాన్సర్ ముప్పును తగ్గించే ఆహార పదార్థాలు ఇవే.. తప్పక తినండి..

Foods

Foods

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నారు. అవగాహన లోపం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో క్యాన్సర్ కేసులు ముదిరిన దశలో నమోదవుతున్నాయి. అయితే పరిస్థితిని సకాలంలో గుర్తించడం, వైద్యుల సలహాతో, ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు. ప్రస్తుతం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరిగా నిద్రపోవడం, ధూమపానం, మద్యపానం వంటివి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం. ఇది కాకుండా పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా ఈ ప్రమాదకరమైన వ్యాధి కేసులు కూడా పెరుగుతున్నాయి. క్యాన్సర్‌ను జయించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి చాలా వరకు క్యాన్సర్ ముప్పును తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు.

READ MORE: Electric Scooter: స్టైలీష్ లుక్, లేటెస్ట్ ఫీచర్స్.. రూ. లక్ష లోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

కాయధాన్యాలు: బీన్స్, చిక్కుడు మొదలైన కాయధాన్యాలు రొమ్ము క్యాన్సర్‌ను బాగా అడ్డుకుంటాయి. క్యాన్సర్‌ను నిరోధించే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. రక్తంలోని షుగర్ స్థాయులను ఇవి క్రమబద్ధీకరిస్తాయి.

బ్రకలీ: ప్రొస్టేట్, పెద్దపేగు, మూత్రాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో ఇది సాయపడుతుంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫోరాఫాన్ శరీరంలోని రక్షణాత్మక ఎంజైమ్‌లను ప్రేరేపించి విషతుల్య మలినాలను తొలగిస్తుంది.

నారింజ: నారింజలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. అంతేగాక చెడు కొలెస్ట్రాల్, బరువును తగ్గిస్తుంది. చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది.

గ్రీన్ టీ: ఇది యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. అన్నవాహిక, వూపిరితిత్తులు, నోటి, పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. ఇందులోని పాలీఫినాల్స్ కొత్త కణాలను భర్తీ చేస్తాయి.

READ MORE: NCERT: పాఠ్యాంశాలుగా ఆపరేషన్ సిందూర్, చంద్రయాన్ మిషన్..

అల్లం: ఇది క్యాన్సర్ కణాలను తమంత తాముగా నశించేటట్లు చేస్తుంది. అండాశయ క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేగాక ఈ కణాలు విస్తరించే శక్తిని కూడా అడ్డుకుంటుంది.

వెల్లుల్లి: ఇందులో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తుంది. రొమ్ము, పెద్ద పేగు, పొట్ట, అన్నవాహిక క్యాన్సర్‌లను నిరోధిస్తుంది.

యాపిల్: రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదని అంటుంటారు. క్యాన్సర్ విషయంలో కూడా ఇది నిజమే. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల నివారణలో యాపిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

సాల్మన్ చేపలు: సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేగాక వివిధ విటమిన్‌లు, ప్రొటీన్లు, సెలీనియం దీని నుండి లభ్యమవుతాయి. ఇవన్నీ కాలేయ క్యాన్సర్‌ను నిరోధించడంలో తోడ్పడతాయి. గుండెపోటును కూడా అడ్డుకుంటాయి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version