Health Tip: లాప్‌టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రోజంతా ల్యాప్ టాప్ ను వాడటం వల్ల శరీరంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ల్యాప్ టాప్ నుంచి వెలువడే వేడి వల్ల మన చర్మంలోపలి కణజాలం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల పురుషుల్లో వంధ్యత్వ (Infertility) సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.
ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల, ల్యాప్ టాప్ వేడి వల్ల మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం వారి శరీర నిర్మాణం (Body structure). ఆడవారి శరీరంలో గర్బాశయం (Cervix) శరీరం లోపల ఉంటుంది. పురుషులలో వృషణం (Testicle) శరీరం యొక్క వెలుపల భాగంలో ఉంటుంది. ఇక ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకోవడం వల్ల వేడి తగులుతుంది. ఉష్ణోగ్రత కారణంగా స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. దీంతో సంతానోత్పత్తి సమస్యలు కూడా రావొచ్చు. అందుకే ల్యాప్ టాప్ ను ఒడిలో ఎక్కువ సేపు పెట్టుకోకూడదు.
Also Read
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
- Monday Fasting Drinks: సోమవారం ఉపవాస సమయంలో ఈ పానీయాలు తాగితే.. నీరసం, అలసట ఉండనే ఉండదు!
- Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
- Crash Dieting: సోషల్ మీడియా డైట్స్‌తో ప్రమాదం.. యువతకు వైద్యుల కీలక హెచ్చరిక
వైఫై ద్వారా రేడియేషన్ వ్యాపిస్తుంది.. ల్యాప్‌టాప్‌ను మీపై ఉంచుకుని ఎక్కువ సేపు పని చేయడం కంటే ఇది చాలా దారుణంగా ఉంటుంది. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి విడుదలవుతుంది. అదే రేడియేషన్ బ్లూ టూత్ కనెక్షన్ నుంచి బయటకు వస్తుంది. రేడియేషన్ ప్రభావం వల్ల నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
కండరాల నొప్పి రావొచ్చు.. ల్యాప్ టాప్ ను కాళ్లపై లేదా ఒడిలో పెట్టుకోవడానికి బదులుగా టేబుల్ పైనే పెట్టండి. కానీ కొంతమంది ల్యాప్ టాప్ ను కాళ్లపై పెట్టుకుని పని చేస్తారు. దీనివల్ల ల్యాప్ టాప్ రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది. ల్యాప్ టాప్ నుంచి వచ్చే వేడి మిమ్మల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. అంతేకాదు ఇది కండరాల నొప్పిని కూడా కలిగిస్తుంది. అందుకే దీనిని ఎక్కువ సేపు ఉపయోగించకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణుల సూచన.
Sarkaru Vaari Paata: ఓటీటీలో రిలీజైన సినిమా.. కానీ ఓ ట్విస్ట్!
- Tags
- keeping
- lap
- laptop problem
- Man
- Woman
తాజావార్తలు
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!