Bonduc Nut: చిన్నప్పుడు గచ్చకాయలు ఆడుకునే ఈ చెట్టు కాయల గురించి అందరికీ తెలిసిందే. ఈ చెట్టును గచ్చకాయ చెట్టు అంటారు. ఈ చెట్టు యొక్క కాండం, కాయలు పైన ముళ్ళు కలిగి ఉంటాయి. కాయలు ఆల్చిప్ప లాగా కనిపిస్తాయి. వీటిలో రెండు లేదా మూడు విత్తనాలు ఉంటాయి. ఇవి చూడటానికి గోళీల పరిమాణంలో ఉంటాయి. పిల్లలు గచ్చకాయలు, గోళీలు ఆడటానికి ఉపయోగిస్తారు. అలాగే ఈ చెట్టు అంతటా ముళ్ళు ఉండడంతో పొలాల రక్షణకు ఈ చెట్లనే కంచెలుగా వాడుతుంటారు. ఈ చెట్టు యొక్క ప్రతి భాగాన్ని పురాతన ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఇందులోని అనేక ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడతాయి. ఈ మొక్కలు ఫెబాసియా కుటుంబానికి చెందినవి. దీని శాస్త్రీయ నామం గిలాండినా బాండుక్. ఈ మొక్క ఆకులను వరి బీజానికి ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను ఆముదంలో వేయించి వృషణాలకు రాస్తే రెండు మూడు రోజుల్లో వరిబీజం తగ్గిపోతుంది.
Read also: Tspsc paper leak: ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. విచారణ జూన్ 5కి వాయిదా
గచ్చకాయలు గింజలు జ్వరానికి బాగా పని చేస్తాయి. గచ్చకాయ గింజల గుజ్జును నేతితో నూరి పొట్టపై రాసుకుంటే జ్వరం త్వరగా తగ్గుతుంది. దంత సమస్యలకు, చిగుళ్లలో రక్తం కారడం, పంటి నొప్పి, గచ్చకాయ చెట్టు కాండం సేకరించి ముల్లును తీసి దానితో పళ్లు తోముకోవడం వల్ల దంతాలు దృఢంగా మారి చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన తగ్గుతాయి. గచ్చకాయలు పువ్వులను నమిలి రసం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. మూత్ర సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. గచ్చకాయ గింజలను నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ గింజలను తిని నీళ్లు తాగితే 15 రోజుల్లో షుగర్ అదుపులోకి వస్తుంది. వీటిని తాగేటప్పుడు రెండు రోజులకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
షుగర్ అదుపులోకి వచ్చిన తర్వాత ఈ గింజలను మానివేయాలి. లేదంటే షుగర్ లో ఉండే అవకాశం ఉంది. ఈ గింజల పేస్ట్‌ని బట్టతలపై అప్లై చేయడం వల్ల జుట్టు తిరిగి పెరుగుతుంది. ఈ గింజలను పొడి చేసి మజ్జిగలో చిటికెడు పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులు, థైరాయిడ్ గ్రంథి వాపు తగ్గుతాయి. రుతుక్రమ సమస్యలు ఉన్న స్త్రీలకు చిటికెడు గచ్చకాయ పొడి, ఐదు మిరియాల పొడి కలిపి తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. ఈ ఆకులను నూనెలో వేయించి కట్టడం వల్ల శరీరంలోని అనేక రకాల నొప్పులకు నొప్పులు తగ్గుతాయి. అంతే కాకుండా ఈ చెట్టు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది మరియు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.