Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Black Grapes Do Not Take Them In This Way

Black Grapes: నల్లద్రాక్షను ఖాళీ కడుపున తింటే ప్రమాదమా? నిజమెంత?

Published Date :March 7, 2023 , 7:46 am
By NTV WebDesk
Black Grapes: నల్లద్రాక్షను ఖాళీ కడుపున తింటే ప్రమాదమా? నిజమెంత?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Black Grapes: మనం ఇష్టంగా తినే పండ్లల్లో ద్రాక్షపండ్లు ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ద్రాక్ష పండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్ష దాదాపు అన్ని కాలాల్లో మ‌న‌కు విరివిరిగా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. ద్రాక్ష‌ పండ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోషకాలు దాగి ఉన్నాయి. ద్రాక్షను తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఇందులో రెండు రకాల ద్రాక్ష ర‌కాలు ఉన్నాయి.. ఒకటి ఆకుప‌చ్చ ద్రాక్ష పండ్లు, రెండు న‌ల్ల ద్రాక్ష పండ్లు. అయితే ఇందులో ఆకుప‌చ్చ ద్రాక్ష పండ్ల కంటే న‌ల్ల ద్రాక్ష పండ్లు మ‌న శ‌రీరానికి మ‌రింత మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్ తో పాటు శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ఇక శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ద్రాక్ష పండ్లు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. నల్ల ద్రాక్షను త‌ర‌చూ ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాదు క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాము.

ఖాళీ క‌డుపున తీసుకుంటే..

నల్ల ద్రాక్షను తినడం వ‌ల్ల మేలు క‌లిగిన‌ప్ప‌టికి వీటిని ఎక్కువ‌ మోతాదులో తీసుకుంటే అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా వీటిని ఖాళీ క‌డుపున అస్స‌లు తీసుకోకూడ‌దట. నల్ల ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌న‌కు తెలియ‌కుండానే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటాం. ద్రాక్ష ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి క్యాల‌రీలు ఎక్కువ‌గా అందుతాయి. ద్రాక్షను మితిమీరి తింటే.. మ‌నం బ‌రువు పెరిగే అవ‌కాశం ఉందని, అలాగే ఇవి శ‌రీరంపై, ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను చూపుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదండోయ్‌ ద్రాక్ష పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల విరోచ‌నాలు క‌లిగే అవ‌కాశం ఉంది.

Read also :Extramarital Affair: భర్త బయటికెళ్లగానే.. భాయ్ ప్రెండ్‎కు ఫోన్.. సీన్ కట్ చేస్తే

ద్రాక్ష తీసుకోవడం వలన జీర్ణ‌క్రియ‌కు ఆటంకం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని, క‌డుపు నొప్పి త‌లెత్తే అవ‌కాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగే అవ‌కాశం ఉందని.. వీటిలో స‌హ‌జ సిద్ద చ‌క్కెర‌లు ఉండటం వలన ఇవి ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిల‌ను పెంచుతాయి. కావున ద్రాక్షను త‌గిన మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి.. వీటిలో ఉండే ఒక ర‌క‌మైన ప్రోటీన్ అల‌ర్జీల‌కు దారి తీస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నల్లద్రాక్షను ఎక్కువ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది క‌ల‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఇక ద్రాక్ష పండ్ల‌ను ఖాళీ క‌డుపుతో తీసుకుంటే మాత్రం అంతే సంగతులు.. ఇది ఆమ్ల‌త్వాన్ని క‌లిగి ఉంటుంది. కాబట్టి వీటిని ఖాళీ క‌డుపున తిన‌డం వ‌ల్ల గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తడంతో పాటు క‌డుపులో నొప్పి, క‌డుపులో చికాకు వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. కావున ద్రాక్ష పండ్ల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను మ‌నం పొందాలంటే వీటిని ప‌రిమిత మోతాదులో మాత్ర‌మే తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.
Pakistan: హోలీ జరుపుకున్నందుకు హిందూ విద్యార్థులను చితకబాదిన తోటి విద్యార్థులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Black Grapes
  • Diabetes
  • Pintop
  • Telugu Health Tips
  • Unique Benefits of Black Grapes

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions