COVID-19: కోవిడ్ చికిత్స తరువాత చిన్నారి కళ్ల రంగు మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COVID-19: గత మూడేళ్లుగా కోవిడ్-19 ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా పూర్తిస్థాయిలో కంట్రోల్ కావడం లేదు. ఇదిలా ఉంటే కోవడ్ సోకిన వారిని దీర్ఘకాలం సైడ్ ఎఫెక్టులతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే థాయ్‌లాండ్ లో కోవిడ్ చికిత్స తర్వాత ఓ చిన్నారి కళ్ల రంగు పూర్తిగా మారిపోయింది.
మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ లో అసాధారణ సందర్బాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణ కోవిడ్ చికిత్స పొందిన తర్వాత 6 నెలల బాలుడి డార్క్ బ్రౌన్(ముదురు గోధుమ) రంగు కళ్లు బ్లూ(నీలం)గా మారాయి. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం.. థాయ్‌లాండ్ కి చెందిన బాలుడు ఒక రోజు జ్వరం, దగ్గులో బాధపడుతుంటే పరీక్ష చేయగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. చికిత్స కోసం :ఫావిపిరావిర్ అనే మందును వాడారు. ఆ తరువాత శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. కాగా ఈ ఔషధాన్ని ఇచ్చిన 18 గంటల తర్వాత పిల్లాడి కంటి రంగు మారడాన్ని తల్లి గమనించింది. డార్క్ బ్రౌన్ ఐస్, బ్లూ కలర్ లోకి మారాయి.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
Read Also: Sanatana Dharma: సనాతన ధర్మంపై దుర్భాషలా..? ఉదయనిధిని బర్తరఫ్ చేయాలి..
అయితే ఫావిపిరావిర్ ఆపేసిన 5 రోజుల తర్వాత బాలుడి అసలు కళ్ల రంగులోకి వచ్చాయి. ఈ మార్పు తర్వాత చికిత్సను ఆపేసినట్లు వైద్యులు తెలిపారు. చర్మం, గోళ్లు, నోరు, ముక్కు శ్లేష్మం వంటి ప్రాంతాల్లో నీలిరంగులోకి మారడం కనిపించలేదు. ఫావిపిరావిర్ థెరపీ ఆపేసిన తర్వాత లక్షణాలు మెరుగయ్యాయి. కార్నియా రంగు మళ్లీ మామూలు స్థితిలోకి వచ్చింది. 2022లో థాయ్‌లాండ్ ప్రజారోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్-19 తేలికపాటి లక్షణాలు ఉన్న పిల్లల చికిత్స కోసం యాంటివైరల్ ఔషధం ఫావిపిరావిర్ ని ఉపయోగించాలని ఆదేశించింది. 2021లో భారత్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 20 ఏళ్ల వ్యక్తికి చికిత్స చేస్తుండగా.. సైడ్ ఎఫెక్ట్ మూలంగా అతని కళ్లు కూడా నీలం రంగులోకి మారాయి.
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!