Site icon NTV Telugu

Lip Care Tips: చలికాలంలో పెదవులు పగులుతున్నాయా..? మృదువైన పెదాల కోసం ఇలా చేయండి

Lips

Lips

చలికాలం వచ్చిదంటే ముఖ్యంగా వేధించే సమస్య పెదవులు పగలడం, కాళ్లు చేతులు పగులుతాయి. చలి కాలంలో అనేక రకాల సమస్యలు తరచుగా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తాయి. జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలే కాకుండా.. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు కూడా ఈ సీజన్‌లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి. శీతాకాలంలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.. చలికాలంలో గాలిలో తేమ ఉండదు. ఈ చల్లని, పొడి గాలి పెదవుల సున్నితమైన చర్మం నుంచి తేమను దూరం చేస్తుంది. దీంతో అవి పొడిబారి పగుళ్లు వస్తాయి. పెదవుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చలికాలం తగినంత నీరు తాగకపోవడం వల్ల చర్మం, పెదవులు పొడిబారిపోతాయి. చలికాలంలో పొడి, పగిలిన పెదాలను సహజంగా మృదువుగా మార్చే కొన్ని పెదవుల సంరక్షణ చిట్కాల గురించి తెలుసుకుందాం.

Read Also: Discount On iPhone: త్వరపడండి.. ఐఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్

నాలుకను పెదాలపై ఉంచొద్దు:
తరచుగా పెదవులు పగిలినప్పుడు లేదా పొడిగా ఉన్నప్పుడు.. పెదవులపై ఉన్న చర్మాన్ని తొలగించడానికి వ్యక్తులు పదేపదే తమ నాలుకను పెదాలపై ఉంచుతారు. అలా చేయడం వల్ల పెదవులకు హానికరం. వాస్తవానికి, లాలాజలంలో ఎంజైమ్‌లు ఉంటాయి.. ఇది పెదవుల పొడిని మరింత పెంచుతుంది. దీంతో.. మరింత నొప్పి, రక్తస్రావం కలిగిస్తుంది.

ధూమపానం మానుకోండి:
పెదవుల సంరక్షణ విషయంలో ధూమపానానికి దూరంగా ఉండటం మంచిది. ధూమపానం మీ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ పెదాలకు కూడా హానికరం. ధూమపానం వల్ల వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా మీ పెదాల చర్మం దెబ్బతింటుంది.

ఎక్స్‌ఫోలియేట్ చేయండి:
మీరు మీ ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచడానికి ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. మీ పెదవులపై మృత చర్మాన్ని తొలగించడానికి వారానికి 2 నుండి 3 సార్లు ప్రత్యేక లిప్ స్క్రబ్‌ని ఉపయోగించండి.

నెయ్యి ఉపయోగించండి:
మీరు మీ పెదాలను సహజంగా మృదువుగా చేయాలనుకుంటే నెయ్యిని ఉపయోగించవచ్చు. నెయ్యి మీ పెదాలకు తక్షణ తేమ, పోషణను అందిస్తుంది, ఇది పొడి, పగిలిన పెదవుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. నెయ్యి చర్మం నునుపుగా.. ఎక్కువ కాలం తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

పుష్కలంగా నీరు త్రాగండి:
తరచుగా పర్యావరణ కాలుష్యం, పొడి గాలి వంటి కారణాల వల్ల పెదవులు పొడిగా, పగుళ్లు ఏర్పడతాయి. ఈ క్రమంలో మీ పెదవుల తేమకు గురికాకుండా ఉండటానికి పుష్కలంగా నీరు త్రాగాలి. సీజన్ ఏదయినా సరే.. మీరు ప్రతిరోజూ కనీసం 7-8 గ్లాసుల నీరు త్రాగడానికి ప్రయత్నించాలి.

Exit mobile version