యాంటీబయాటిక్స్.. శరీరంలో బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కానీ వాటిని అధిక మొత్తంలో తీసుకోవడం ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇప్పటికే మందులు వాడుతున్న హార్ట్ పేషెంట్లు డాక్టర్‌ని సంప్రదించకుండా మరే ఇతర యాంటీబయాటిక్ మందులను తీసుకోకపోవడం మంచిది.
READ MORE: Gottipati Ravikumar: వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు.. వారికి ఉచిత విద్యుత్ పథకం..!
మితిమీరిన మోతాదులో యాంటీ బయాటిక్స్‌ను వాడటం వల్ల రోగాలు తగ్గడం కాదు.. కొత్త రోగాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచంలో యాంటీ బయాటిక్స్ వాడకంలో మన దేశమే అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా, అమెరికా ఉన్నాయి. ప్రపంచంలోనే బాక్టీరియా సంబంధ వ్యాధులు ఎక్కువగా మన దేశంలోనే ఉన్నాయని, ఆ రోగాలను తట్టుకోవడానికి యాంటీ బయాటిక్స్ వాడుతున్నామని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అయితే, వాటి వాడకం ఎక్కువైతే గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
READ MORE: Donald Trump: అమెరికా అధ్యక్షుడైన తొలి రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం..
యాంటీ బయాటిక్స్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునేందుకు అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు పరీక్షలు నిర్వహించగా సిప్రోప్లోక్సాసిన్(సిప్రో) వంటి ఫ్లోరోక్వినోలోన్ యాంటీ బయాటిక్స్, ఇతర యాంటీ బయాటిక్స్ వల్ల 2.4 రెట్లు ఎక్కువగా హృద్రోగాలు వస్తున్నట్లు తేలిందట. వీటి వల్ల గుండె నుంచి ముందుకు ప్రవహించాల్సిన రక్తం.. వెనక్కి వచ్చే ముప్పు ఉందని వెల్లడైందట. 12వేల మందిపై అధ్యయనం చేయగా 30 రోజుల కంటే ఎక్కువ కాలం యాంటీ బయాటిక్స్ తీసుకునే వారు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు వివరించారు. అందుకే హృదయ రోగులు జాగ్రత్తలు పాటించడం మేలు.