Heart Attacks: ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో వయసు పైబడినవారికి వచ్చే ఓ జబ్బుగా గుండెపోటు ఉండేది. కానీ ఇప్పుడు యువతలో ముఖ్యంగా టీనేజ్ లో కూడా గుండెపోటు రావడం తద్వారా మరణాలు సంభవించడం చోటు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే గుండెపోటుపై ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఓ అధ్యయాన్ని నిర్వహించింది. ఇది టాప్ మెడకల్ జర్నల్ అయిన ది లాన్సెట్ లో ప్రచురించబడింది.
హార్ట్ ఎటాక్ ఎమర్జెన్సీ సమయాల్లో కొద్ది పాటి రోగులు, అంటే కేవలం 10 శాతం మాత్రమే గంటలోపు ఆస్పత్రులకు చేరుకుంటున్నారని వెల్లడించింది. వేగంగా ఆస్పత్రులకు చేరుకోవడం వల్ల మరణాలను నిరోధించే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 30 నుంచి 40 శాతం మంది ప్రజలు, పరిస్థితులు నియంత్రణలో ఉన్న కారణంగా ఆలస్యం కాకుండా ఆస్పత్రులకు వెళ్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇదిలా ఉంటే 55 శాతం మంది పరిస్థితి తీవ్రతను గుర్తించకుండా.. ఆలస్యం చేయడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని కనుగొన్నారు.. అయితే ఇది గుండెపోటా..? సాధారణ నొప్పి..? అని తెలియకుండా ఆస్పత్రికి వెళ్లాలా..? వద్దా..? అనే అయోమయంలో ఉన్నారని స్టడీ తేల్చింది.
Read Also: Swiggy: మొన్న న్యూ ఇయర్.. ఇప్పుడు ఐపీఎల్… స్విగ్గీకి కాసుల పంట
20 నుంచి 30 శాతం మంది వాహనం, చికిత్స కోసం డబ్బు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆదే ఆలస్యానికి కారణం అవుతుందని, కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ఆస్పత్రులుకు దూరంగా ఉండటం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. దాదాపుగా 10 శాతం మంది ప్రజలు సకాలంలో ఆస్పత్రికి చేరినా.. చికిత్సలో జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని, ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితులకు రెస్సాన్స్ అవకుండా కొన్ని పరిస్థితులు అడ్డుకుంటున్నాయని తేల్చింది.
435 మరణాలపై ఏడాది పాటు అధ్యయనం చేశారు. గుండె పోటు అనేది ప్రాణంతకమైన వ్యాధి అని.. ముఖ్యంగా ఛాతి నొప్పితో పాటు ఎడమ వైపున నొప్పిగా, లాగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, అన్ని ఛాతి నొప్పులు గుండె నొప్పి కాదని, అయితే ప్రతీ గుండె పోటు కూడా ఛాతినొప్పితోనే ప్రారంభం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. బీపీ, ఊబకాయం అధికంగా ఉంటే గుండెపోటు రిస్క్ ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.