NTV Telugu Site icon

Health Tips: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..డైట్ లో వీటిని చేర్చాలి..

Kidney Health

Kidney Health

మానవ శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యమైందే.. ఏ ఒక్కటి పనిచేయకున్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.. అందులో కిడ్నీలు కూడా ఒకటి.. మనిషి రక్తాన్ని శుద్ధి చెయ్యడంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.. అందుకే వీటిని ఆరోగ్యంగా చూసుకోవడం ముఖ్యం.. వీటికి ఏదైనా ప్రమాదం జరిగితే అన్నీ అవయవాల పై భాగాలపై పడుతుంది.. అందుకే కిడ్నీలకు ఏదైనా సమస్యలు రాకుండా చూసుకోవాలి.. కిడ్నీల సమస్యలతో పోరాడుతున్న వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..

కిడ్నీ ల సమస్యలు ఉన్నవారు సాధ్యమైనంతవరకూ తేలికైన ఆహారం తీసుకోవాలి. మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మాంసాహారం పూర్తిగా మానేయాలి. ఎక్కువగా మసాలా పదార్ధాలు, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా కిడ్నీలపై దుష్ప్రభావం చూపిస్తాయి. రోజూ రాత్రి వేళ పండ్లు తింటే మంచిది. ఎప్పటికప్పుడు లభించే సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే బాడీ డీటాక్స్ అవుతుంటుంది.. తేలిగ్గా జీర్ణం అయ్యేవాటిని డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం… అప్పుడే గ్యాస్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి..

ఇక రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా కిడ్నీల పనితీరు బాగుంటుంది… ఇకపోతే స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తినకూడదు. ఫైబర్ ఎక్కువగా ఉండి, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి.. పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలను తీసుకోవడం మంచిది.. కొవ్వు లేని ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా డైట్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండి పనితీరు మెరుగుపడుతుంది. శరీరం ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసేందుకు నిమ్మరసం, కీరా, దోసకాయ వంటివి తరచూ తీసుకోవాలి. డీటాక్స్ అయ్యే కొద్దీ కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంంటుంది.. ఇంకేదైనా సమస్యగా ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది…