Site icon NTV Telugu

Health Tips: జీలకర్రను ఇలా తీసుకుంటే చాలు.. త్వరగా బరువు తగ్గుతారు..

Cumin Seeds

Cumin Seeds

ఈరోజుల్లో అధిక బరువు సమస్య అందరిని భాదిస్తుంది.. ఎన్నిరకాలుగా చేసిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇక అందరు వంటింటి చిట్కాలను ఫాలో అవుతుంది.. వంటింట్లో బరువు తగ్గించే వాటిలో జిలకర్ర కూడా ఒకటి.. జీలకర్ర తో బరువును తగ్గడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

జీలకర్రలో ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, ఫైబర్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా, మీరు కండరాల నొప్పి, శరీరం వాపు నుండి బయటపడతారు. అంతే కాదు, ఇది బరువు తగ్గించడంలో, మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది, కాబట్టి జీలకర్ర తీసుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

జీలకర్ర లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయినట్లయితే, మీరు ప్రతిరోజూ జీలకర్ర తీసుకోవాలి. దీని కారణంగా, మీ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు బరువు తగ్గడం సులభం.. అదే విధంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే, మీరు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జీలకర్రను తినాలి. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అదే సమయంలో, జీలకర్ర మీ జీవక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది..

ఇకపోతే జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది మీ చర్మాన్ని అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది, తద్వారా మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.. వృద్ధాప్య ఛాయాలు కూడా రావని నిపుణులు అంటున్నారు.. ఈ జిలకర్రను రాత్రంతా ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి.. ఉదయం బాగా కాచి చల్లార్చి తాగితే మంచి ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు.. మీకు నచ్చితే మీకు కూడా ట్రై చెయ్యండి..

Exit mobile version