Health Tips : పొన్నగంటికూర అబ్బాయిలకు చేసే మేలు తెలిస్తే.. అస్సలు వదలరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. వీటిని రోజు ఏదొక రూపంలో తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు నయం చేస్తాయి.. అందుకే డాక్టర్లు రోజూ ఏదొక ఆకు కూరలను తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.. ఇక పొన్నగంటి కూరలో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు ఉంటాయనికి నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా పురుషులకు అనేక రకాల సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పొన్నగంటి ఆకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎ, బి6, సి విటమిన్లు, ఫొలేట్, రైబోఫ్లెవిన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా దొరకుతాయి. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. పొన్నగంటి ఆకు గుండె, మెదడుకు ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే ఫలితముంటుంది. దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది.. అలాగే క్యాన్సర్ కారకాలను నయం చేస్తుంది.. బరువును కంట్రోల్ చేస్తుంది..
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ఈ ఆకుతో బరువు తగ్గడం, పెరగడం, శరీర సౌష్ఠవం వంటి ఉపయోగాలున్నాయి. కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే సన్నగా ఉన్నవారు బరువు పెరుగుతారు. అలాగే ఈ ఆకును ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. కంటి కలకలు, కురుపులతో బాధపడేవాళ్లు తాజా ఆకుల్ని కళ్లమీద కాసేపు పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది..
ఈ ఆకు కూరను తింటే పురుషులకు కావలసిన శక్తిని సమకూరుస్తుంది.. లైంగిక సామార్థ్యాన్ని పెంచుతుంది.. పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను సరిచేస్తుంది. టేబుల్ స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా తగ్గుతాయి. నరాల్లో నొప్పికి, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!