NTV Telugu Site icon

Health Tips: రోజూ పొద్దున్నే దీన్ని తింటే.. 60 ఏళ్లు వచ్చినా వయస్సు ఎంతో కనిపెట్టలేరు..!

Phool Makhana

Phool Makhana

కొందరు ఎంత వయస్సు వచ్చిన కూడా వయస్సెంతో కనిపెట్టలేము.. వాళ్ళు తీసుకొనే ఆహారంతో డైట్ ను మైంటైన్ చెయ్యడం వల్ల వాళ్ళు ఎంత వయస్సు వచ్చిన యవ్వనంగా ఉంటారు..మామూలుగా ప్రతి డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, జింక్ వంటి పోషకాలు చర్మానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి..మొటిమలు, మొటిమల మచ్చలను తగ్గించడంలో ఒమేగా3, కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడుతాయి. దీనితో పాటు, చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. వీటి కారణంగా చర్మం యవ్వనంగా అందంగా కనిపిస్తుంది. అందుకే ఈ డ్రై ఫ్రూట్స్‌ని రోజువారీ దినచర్యలో చేర్చుకోవాలంటారు చర్మ నిపుణులు.

ప్రతిరోజూ ఒక పిడికెడు మఖానా తింటే, అది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, గోర్లు, జుట్టు మెరుపును ఇవ్వడంలో పనిచేస్తాయి.. వీటివల్ల ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వృద్ధాప్యంలో చర్మాన్ని ముడతలు రాకుండా వయసు పైబడిన విధంగా కనిపించకుండా రక్షించడానికి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే సూపర్‌ఫుడ్‌ను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.. వేయించి తీసుకోవడం అంత మంచిది కాదు..

ఈ మఖానాలో లభించే కెంప్ఫెరోల్ అనే రసాయనం చర్మాన్ని బిగుతుగా చేయడానికి, చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చి, నల్ల మచ్చలను కాంతివంతం చేయడానికి బాగా పనిచేస్తుంది..మఖానా మంచి కొవ్వును కలిగి ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె జబ్బులకు చాలా మంచి అల్పాహారంగా పనిచేస్తుంది.ఫాక్స్ నట్స్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం, సోడియం కాకుండా, ఫాక్స్ నట్స్‌లో కూడా అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది, కాబట్టి అవి ఎముకలు, దంతాలను దృడంగా ఉండేలా చేస్తుంది. ఎన్నో ప్రాణంతకర వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు..