జామపండు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. అందులో ఎర్రని జామ పండ్లతో ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నాయి.. ఒకప్పుడు ఎర్ర జామ చాలా తక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు చాలా విరివిగా లభ్యం అవుతుంది.. ఈ జామపండులో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకి ఒక ఎర్ర జామపండు తింటే ఎన్నో ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు.. అవేంటో తెలుసుకుందాం..
ఈ పండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన కండరాల తిమ్మిరి తగ్గించటమే కాకుండా కండరాలు ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.. విటమిన్ ఏ, ప్లేవనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్లైకోపిన్ ఉండుట వలన లంగ్స్, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది..
ఈ జామ కాయలో పోటాషియం సమృద్ధిగా ఉంటుంది..
రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పండు తింటే అలసట, నీరసం తగ్గి చురుకుగా ఉంటారు. బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉండుట వలన రక్తకణాల వృద్దికి సహాయపడుతుంది.. అన్నిటికన్నా ముఖ్యమైంది ఈరోజుల్లో అధిక బరువును కంట్రోల్ లో ఉంచుతుంది.. నీరసం లేకుండా చేస్తుంది.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. కొంతమంది జామ కాయలు తింటే జలుబు చేస్తుందని అనుకుంటారు.. కానీ అందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.. సో వర్షాకాలంలో కూడా తినొచ్చుసో ఎక్కడ ఈ పండు కనిపించినా కూడా అస్సలు మర్చిపోకుండా వీటిని తెచ్చుకొని తినండి.. ప్రయోజనాలేంటో మీరే చూడండి..