NTV Telugu Site icon

Health Tips: ఎండు డ్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో.. ఆ సామార్థ్యాన్ని పెంచుతుంది..

Kissmissbenefit

Kissmissbenefit

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉంటాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ ల కంటే కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషక పదార్థాలు ఈ కిస్మిస్ లో దాగి ఉన్నాయి. మరి ఈ కిస్మిస్ లో ఉండే ఔషధగుణాలేంటో ఎండు ద్రాక్షల వల్ల కలిగే ప్రయోజనాలమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఎండు ద్రాక్షలో రాగి అధికంగా ఉంటాయి. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారిస్తుంది. వీటిని తినడం వల్ల ఎర్ర రక్తకణాలు అధికంగా ఉత్పత్తికి అయి రక్తం సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ లాంటివి రాకుండా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని చలికాలంలో ఎక్కువగా తింటే శరీరంలో బ్యాక్టీరియా చేరకుండా కాపాడి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది..ఇందులో అధిక శాతం ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ శక్తి కూడా మెరుగు పడుతుంది..అయితే ఈ ఎండిన ద్రాక్షను నానబెట్టి తినడం వలన అధికంగా పోషకాలు లభిస్తాయి. అలాగే ద్రాక్షను నానబెట్టిన నీటిని తాగితే ద్రాక్షలో ఉండే పోషక విలువలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కిస్మిస్‌లో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది. అలాగే ఇందులో ఉండే పాలిఫినాలిక్ ఫైటో శరీరం వాపును తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే పిల్లల మెదడు చురుకుగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు దీన్ని తింటే త్వరగా బరువును తగ్గవచ్చు.. మగవారిలో లైంగిక సామార్థ్యాన్ని పెంచుతుంది.. నీరసంగా ఉండేవారు దీన్ని తింటే ఒంట్లో నీరసం తగ్గుతుంది.. ఇంకా రక్తం పెరుగుతుంది.. చర్మ, జుట్టు సంరక్షణ లో ఇది బేసుగ్గా పని చేస్తుంది.. చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇక ఆలస్యం ఎందుకు రోజూ తినండి..

Show comments