Health Tips : వాము ఆకులను ఇలా వాడితే ఎన్ని ప్రయోజనాలో.. ఆ సమస్యలకు చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాము గురించి వినే ఉంటారు.. వామును రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ వాము ఆకులను ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వాము ఆకులు కడుపునొప్పిని తగ్గించడానికి అలాగే దగ్గు జలుబు చేసినప్పుడు ఎంతో బాగా ఉపయోగపడతాయి.. అలాగే ఈ వాము ఆకును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వీటిని రెగ్యూలర్ గా వాడటం మంచిది.. కరివేపాకు, కొత్తిమీరను ఉపయోగించినట్లు వాము ఆకులను కూడా కూరల్లో వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అజీర్తి, ఉబ్బరం, పొట్ట గ్యాస్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. అలాగే ప్రేగుల్లో నొప్పి అల్సర్లు లాంటివి తగ్గుతాయి. వామాకులలో క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేటు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది.. బరువును కూడా తగ్గిస్తాయి..వామాకులో ఎ, బి, సి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం. తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది. వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది.
Also Read
- Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
- Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
- Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
- Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
ఈ ఆకులు సువాసనలను వెదజల్లుతాయి.. వీటిని ఎక్కువగా చట్నీలు, జ్యూస్, బజ్జీలు, పకోడీలు కూరలులో కూడా వాడుకోవచ్చు. ఈ ఆకుల వల్ల ఆయుష్ పెరుగుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వాము ఆకుల్ని నిత్యం వాడే వారికి దగ్గు, జలుబులు అస్సలు రావు. ఒకవేళ వస్తే పది వాము ఆకుల్ని కడిగి వేడి నీటిలో వేసి మరిగించుకోవాలి. ఈ నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి తీసుకోవాలి.. మీకు కావాలి అనుకుంటే తేనెను కూడా వేసుకోవచ్చు.. ఇలా ప్రతి రోజూ తీసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!