NTV Telugu Site icon

Strong Bones Food: 30 ఏళ్ల తర్వాత వీటిని తింటే.. ఎముకలు దృఢంగా ఉంటాయి!

Strong Bones

Strong Bones

If you eat these food after 30 years, Your bones will be strong: ప్రస్తుత రోజులో ప్రతిఒక్కరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నాణ్యమైన ఆహరం దొరకడం లేదు. ఇప్పుడంతా కెమికల్స్ మయం అయిపొయింది. దాంతో వయసు పెరిగే కొద్దీ.. శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది. ఇలా కాకుండా ఉండలాంటే తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే ఎముకలు బలంగా ఉంటాయి. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత ఎముకల్లో బలం తగ్గుతుంది. అందుకే ఆహారం మరియు పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎముకలు దృఢంగా ఉండేలా చేసే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.

తీసుకోవాల్సిన ఆహారం (Strong Bones Home Remedies):
30 ఏళ్లు దాటిన తర్వాత ఆహారంలో పచ్చి కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బచ్చలికూర, బ్రోకలీ, సొరకాయ వంటి కూరగాయలను రోజూ తీసుకోవాలి. పాల ఉత్పత్తులలో మంచి కాల్షియం ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో చీజ్ మరియు పాలను చేర్చుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎందుకంటే పెరుగులో కాల్షియం ఉంటుంది.

30 ఏళ్లు దాటిన తర్వాత ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా చాలా మంచిది. నిత్యం పండ్లను తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఆపిల్స్, ద్రాక్ష, అరటి పండు, ఆరేంజ్, జామ లాంటి పండ్లను ప్రతిరోజు తినాలి. ఎక్కువగా సిట్రస్ పండ్లను రోజూ తీసుకోవాలి. 30 ఏళ్ల తర్వాత కూడా ఎముకలు దృఢంగా ఉండాలంటే సోయాబీన్‌ను ఆహారంలో చేర్చుకోవాలి.

Also Read: Hair Care Tips: యవ్వనంలోనే మీ జుట్టు తెల్లబడుతోందా?.. ఈ నేచురల్ పద్దతులతో మీ సమస్యకు చెక్ పెట్టండి!

తీసుకోకూడని ఆహరం (Do Not Eat Food for Strong Bones):
మరోవైపు మోతాదుకు మించి ఉప్పును ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ద్వారా కాల్షియం ఎక్కువ మొత్తంలో బయటకు వెలుతుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఒక నిర్దిష్టమొత్తంలో సోడియం, పొటాషియంలు మీ శరీరంలో ఉండాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినొద్దు. అప్పుడే మీ ఎముకలు బలంగా ఉంటాయి.

ఐరన్‌ను మోతాదుకు మించి తీసుకోవడం ఎముకలకు మంచిది కాదు. కాల్షియం శోషణకు ఐరన్ అంతరాయం కలిగిస్తుంది. అలానే ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితిలోనే తీసుకోవాలి. ఫాస్ఫారిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే సోడాలు, శీతల పానీయాలు వంటి కార్బోనేటేడ్ పానీయాలను తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే స్వీట్స్ మోతాదులో తినాలి.

Also Read: Ashes Test 2023: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణి.. పలు రికార్డులు బద్దలు!