NTV Telugu Site icon

Health Tips : శరీరంలోని అతి వేడికి చెక్‌ పెట్టండిలా..!

Body Heat

Body Heat

శరీరంలోని అతి వేడి కారణంగా ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఇక ఎండా కాలంలో అయితే ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరంలో వేడి అధికం అవ్వడానికి మసాలా ఆహారాలు తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, అదే పనిగా కుర్చీలో కూర్చొని పనిచేయడం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే.. దీని వలన మూత్ర విసర్జన సమయంలో చాలా మంటగా, నొప్పిగా రావచ్చు కూడా. అయితే మనం శరీరంలోని వేడిని అతి సులభంగా మన ఇంట్లో ఉన్న పదార్థాలను ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్రను కొద్దిగా పటిక బెల్లం వేసి ఒక రెండు నుండి మూడు గంటల పాటు నానబెట్టాలి. జీలకర్ర , పటిక బెల్లంలు మన శరీర వేడిని తగ్గించడానికి బాగా దోహదపడుతాయి. ఇలా నానబెట్టిన జీలకర్ర, పటిక బెల్లం కలిపిన నీటిని తాగడం వలన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇలా మీరు రోజులో ఒక రెండు సార్లు తాగితే శరీరంలో వేడి అనేది తగ్గిపోతుంది. ఇదే.. మీరు మరో విధంగా కూడా తీసుకోవచ్చు.

జీలకర్ర, పటిక బెల్లంలు సమానంగా తీసుకొని మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఒక డబ్బాలో నిలువ చేసుకోని.. రోజు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్‌ పొడిని కలిపి తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు తాగితే శరీరంలోని వేడి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంట వంటివి కూడా ఇబ్బంది పెట్టవు. దీంతో పాటు.. మజ్జికలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తాగినా.. శరీరంలో అతి వేడిని తగ్గించుకోవచ్చు. ఇదికాకపోయినా.. ఒక మూడు నాలుగు టీ స్పూన్‌ సబ్జా గింజలను తీసుకొని ఒక నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన సబ్జా గింజలను ఒక గ్లాసులోకి తీసుకొని మరి కొన్ని నీటిని కలుపుకొని అందులో ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండాలి. ఇలా తయారుచేసిన పానీయం తీసుకోవడం వలన శరీరంలోని వేడి అనేది చక్కగా తగ్గిపోతుంది.