Health Tips: యాలకలను రోజూ ఇలా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే యాలకలతో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అస్సలు వదలకుండా రోజు తింటారు…యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే దీన్నిన సాంప్రదాయ వైద్యంలో ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. యాలకులు వివిధ వంటకాలు, పానీయాల రుచిని పెంచడమే కాకుండా.. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అసలు యాలకులు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో వివరంగా తెలుసుకుందాం..
డయాబెటిస్ తో పోరాడుతున్న వ్యక్తులకు యాలకులు మంచి మేలు చేస్తాయి. యాలకులు రక్తంలో చక్కెరను నియంత్రించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మసాలా ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుందని, గ్లూకోజ్ జీవక్రియను పెంచుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని తేలింది.. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.. అధిక బరువు సమస్య తగ్గుతుంది..
Also Read
- Millet Vegetable Soup Recipe: చలికాలంలో టీ, కాఫీకి గుడ్‌బై..! వేడివేడిగా ఈ సూప్ తాగండి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
- Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
- Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
- Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
ఇకపోతే యాలకులు అజీర్ణం, ఉబ్బరం, కడుపు తిమ్మిరి వంటి వివిధ జీర్ణశయాంతర సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఈ మసాలా దినుసు నూనె జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. అంతేకాదు యాలకులు వాయువును తగ్గిస్తాయి. అలాగే అల్సర్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి… అదే విధంగా..బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. సినియోల్, లిమోనేన్ వంటి దాని క్రియాశీల సమ్మేళనాలు యాంటీమైక్రోబయల్ ప్రభావాలను కలిగి ఉంటాయి..చెడు శ్వాస, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, దంత క్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. అంతేకాదు యాలకుల సహజ సుగంధ సమ్మేళనాలు చెడు వాసన రాకుండా కాపాడుతాయి.. లైంగిక సామార్థ్యాన్ని కూడా పెంచుతుంది.. పురుషులు ప్రతి రోజు వీటిని తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Rakul Preet Singh: టాలీవుడ్ అన్నీ ఇచ్చింది.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Seattle Airport Chaos: ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ఇద్దరిని ఈడ్చుకెళ్లిన ICE అధికారులు!
-
Millet Vegetable Soup Recipe: చలికాలంలో టీ, కాఫీకి గుడ్‌బై..! వేడివేడిగా ఈ సూప్ తాగండి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
-
Iran Warns US: అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. ‘ఇది ఆరంభం మాత్రమే’.. అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీలో IRGC చీఫ్!
-
Hyderabad: కొడుకు కావాలి, కూతుళ్లు వద్దంటూ మెసేజ్‌లో ట్రిపుల్ తలాక్.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!