NTV Telugu Site icon

Health Tips : రాత్రి పడుకొనే ముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Drinking Water

Drinking Water

మానవ శరీరానికి నీరు చాలా ముఖ్యం.. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, శరీరంలో మలినాలు బయటకు పోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ఎంతో అవసరమవుతుంది.. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తప్పక తీసుకోవాలి.. అయితే నీటిని తాగే విషయంలో చాలా మంది అనేక అపోహలను కలిగి ఉన్నారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదు అనే అపోహను కలిగి ఉన్నారు.. అసలు రాత్రి పూట ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

షుగర్ వ్యాధితో బాధపడే వారు, గుండె సమస్యలతో బాధపడే వారు రాత్రి పూట నీటిని ఎక్కువగా తాగకూడదు.. కానీ రాత్రి పూట సరిగ్గా నీటిని తీసుకోవడం మంచిది.. పడుకునే సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల గొంతు ఆరిపోతుంది. గురక ఎక్కువగా వస్తుంది. కనుక మనం నిద్రించేటప్పుడు శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవాలి.. రాత్రి పడుకొనే ముందు నీటి శాతాన్ని తగ్గకుండా చూసుకోవాలి.. లేకుంటే నిద్ర సరిగ్గా రాదు..

రాత్రి పూట నీటిని తాగడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోతాయి. చర్మం అందంగా,కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలో వేడి చేయడం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే రాత్రి పూట నీటిని ఎక్కువగా తాగడం వల్ల మనం నిద్రించిన తరువాత మూత్రవిసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. మననిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే పొట్ట నిండా నీటిని తాగి పడుకోవడం వల్ల శ్వాస ఇబ్బందులతో పాటు గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.. అందుకే పడుకొనే అరగంట ముందు నీటిని తాగడం మంచిది.. ఎంత తాగిన యూరిన్ పాస్ పడుకొనేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.