Health Tips: కరివేపాకును ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి కూరలోనూ కనిపిస్తుంది.. అయితే అందరు దాన్ని తినకుండా పక్కన తీసిపడేస్తారు.. అందుకే చాలా మంది కరివేపాకును పొడిగా చేస్తారు.. లేదా రైస్ చేసుకొని తింటారు.. దీన్ని ఎక్కువగా బాలింతలకు పెడతారు. అయితే నిజానికి ఈ ఆకులను చాలామంది కూరల్లో నుంచి తీసి పడేస్తారు. కానీ దీని వల్ల మనకు అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.. కరివేపాకుతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కరివేపాకు వల్ల కేవలం జుట్టుకు మాత్రమే పోషణ అందుతుంది అనుకుంటే.. మీరు పప్పులో కాలు వేసినట్లు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ కరివేపాకు తీసుకోవడం వల అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా రాకుండా చూస్తుంది..
Also Read
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
కరివేపాకును నిత్యం తినడం వల్ల అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కరివేపాకును డైలీ ఆహారంలో చేర్చుకుంటే సులువుగా బరువును తగ్గితారు..
డయాబెటీస్.. ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.. ఇలాంటి వారికి కరివేపాకు చాలా అద్భుతంగా పని చేస్తుంది. కరివేపాకు సారం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఉన్న ఇన్సులిన్ ని కరివేపాకు మెరుగుపరుస్తుంది..
కరివేపాకుతో కంటిచూపు మెరుగుపడుతంది. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి..
పడగడుపున కొంతమంది వికారంతో బాధపడుతూంటారు. దీంతో తలనొప్పి కూడా వస్తుంది. అలాగే గర్భిణిలు కూడా వికారంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు కరివేపాకు చక్కగా పని చేస్తుంది.
కరివేపాకుతో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. కరివేపాకు తినడం వల్ల మెదడు యాక్టీవ్ గా ఉంటుంది.. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి..
కరివేపాకులో బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్ ఫెక్షన్ల బారిన పడిన వారు కూడా ఈ సమయంలో కరివేపాకు కషాయం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు..
తాజావార్తలు
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!