చలికాలంలో వస్తే జబ్బులు కూడా వస్తాయి.. అయితే ఒకవైపు చలి, మరోవైపు సీజన్ వ్యాధులు అనేక ఇబ్బందులకు గురించి చేస్తుంది.. కొన్ని ఆహారాలను తీసుకోవడం రెగ్యూలర్ గా తీసుకోవడం మంచిది.. అయితే చాలా మందికి చలికాలంలో చేపలు తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది.. మరి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
నిజానికి చలికాలంలో చేపలను తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో రోగాలను కట్టడి చేస్తాయని చెబుతున్నారు..చలికాలంలో తరచుగా జలుబు, దగ్గులు సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలతో కూడా ఇది తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లో చాలా ప్రభావంతంగా పనిచేస్తూ ఉంటుంది. చేపలు తీసుకోవడం వలన శరీరంలోని అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ లోపాల్ని తగ్గిస్తుంది. ఇది కంటిచూపుని మెరుగుపరుస్తుందట..
అదే విదంగా విటమిన్ బి12 ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధుల నుండి బయటపడేస్తుంది. ఇటువంటి పోషకాలు సల్మాన్ ఫిష్ లో ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో ఉపయోగపడతాయి.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటుగా గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది.. ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మెదడు కూడా చాలా మంచి చేస్తాయి. దీని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇది కాకుండా శరీరంలో వచ్చే వాపులు తగ్గించడంలో గొప్పగా పనిచేస్తాయి.. ఇంకా చర్మ సమస్యలను తగ్గిస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.