NTV Telugu Site icon

బట్టతలకు మందు వచ్చిందోచ్.. ఇక మీ జుట్టు మీ సొంతం

Bald

Bald

ప్రస్తుతం మగవారిని అందరిని వేధిస్తున్న సమస్య బట్టతల.. చిన్న వయస్సులోనే జుట్టు రాలిపోయి నుదురు భాగం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక దీంతో మగవారు తీవ్ర ఆందోళనకు గురై ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 35 ఏళ్లు దాటగానే జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. 40 ఏళ్లకు ఖాళీ గుండుగా మారుతుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి.. మెంటల్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్స్, సరైన ఆహరం తీసుకోకపోవడం.. ఇలాంటి కారణాలు ఏమైనా పరిష్కారం మాత్రం ఎవరికి తెలియడం లేదు.. ఇక వంటింటి చిట్కాల వలన విసిగిపోయిన వారు కాస్త డబ్బు ఉంటే.. హెయిర్ ప్లాంటేషన్ తో మళ్లీ తిరిగి మాములు జుట్టును తెచ్చుకుంటున్నారు. అయితే చాలా రిస్కీ.. ఏమాత్రం తేడా వచ్చినా ప్రమాదమే.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు హెయిర్ ప్లాంటేషన్ తో జుట్టును తెచ్చుకున్నవారే.. అయితే వారిలా అందరు లక్షలు లక్షలు పెట్టలేరు.. అయితే ఇలా బట్టతలతో విసిగిపోతున్నవారికి ఒక గుడ్ న్యూస్. ఎట్టకేలకు బట్టతల సమస్యకు అమెరికా శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. వారు చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు బట్టతల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. అదేంటంటే.. బట్టతలపై జుట్టు రావడానికి ఒక ట్యాబ్లెట్ తయారు చేశారట.. దాని పేరు సీటీపీ-543.

అమెరికాకు చెందిన డ్రగ్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ప్రస్తుతం ఈ మాత్రలపై ప్రయోగాలు చేస్తోంది. ఈ మాత్రలను బట్టతల ఉన్నవారు రోజుకు రెండు చొప్పున వేసుకుంటే.. కొత్త జుట్టు రావడం గ్యారెంటీ అని చెప్పుకొస్తున్నారు. ఈ డ్రగ్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్ అమెరికాలో 706 మంది బట్టతల వ్యక్తులపై ప్రయోగం చేసింది. అందులో మూడు టీమ్ లకు ఒక గ్రూప్ లోని వారికి 8ఎంజీ ట్యాబ్లెట్ రోజుకు రెండు సార్లు ఇచ్చారు. మరో గ్రూప్ వారికి రోజుకి రెండు సార్లు 12 ఎంజీ మాత్ర ఇచ్చారు. ఇలా ఇచ్చినవారిలో 12 ఎంజీ తీసుకున్నవారికి అనుకున్నదానికంటే ఎక్కువ జుట్టు వచ్చిందని వారు చెప్తున్నారు. వారు చేసిన ప్రయోగంలో సత్పలితాలు రావడంతో త్వరలోనే ఈ మాత్రలను మార్కెట్ లోకి విడుదల చేయనున్నారట. అయితే ఈ ప్రయోగంలో కొన్ని సైడ్ ఎఫక్ట్ కూడా వచ్చాయని, తలనొప్పి రావడం, మొటిమలు రావడం జరిగాయని. వాటిని ఓవర్ కమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగంలో దాదాపు సగం మందిలో ఆరునెలల్లో పూర్తి తల వెంట్రుకలు పెరిగినట్లు గుర్తించారు. ఒకవేళ ఈ మాత్ర త్వరగా మార్కెట్ లోకి వస్తే బట్టతలకు మంచి పరిష్కారంగా మారుతోంది అంటున్నారు పలువురు.. ఇక ఈ ప్రయోగం ఎప్పుడో పూర్తయ్యి.. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని బట్టతల ఉన్నవారు వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.